డిజిటల్ స్మార్ట్‌నెస్‌తో మహిళలకు రక్షణ
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:10 AM
నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్, వర్క్ ఫమ్ హోమ్, బ్యాంకింగ్ వ్యవహారాల నుంచి సోషల్ మీడియా వాడకం వరకు మన దైనందిన జీవితమంతా డిజిటల్ ప్రపంచంతో ముడిపడి ఉంది....
నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్, వర్క్ ఫమ్ హోమ్, బ్యాంకింగ్ వ్యవహారాల నుంచి సోషల్ మీడియా వాడకం వరకు మన దైనందిన జీవితమంతా డిజిటల్ ప్రపంచంతో ముడిపడి ఉంది. సాంకేతికత మహిళల జీవితాలను ఎంతో సులభతరం చేసినప్పటికీ, దానికి సమాంతరంగా సైబర్ నేరాలు కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగే ఆన్‌లైన్ మోసాలు, బెదిరింపులు, వ్యక్తిగత డేటా చోరీ వంటి ఘటనలు వారి భద్రతకు పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ‘డిజిటల్ స్మార్ట్‌నెస్’, సైబర్ అవగాహన కలిగి ఉండటం ప్రతీ స్త్రీకి అవసరం.
ప్రధాన సైబర్ నేరాలు
మార్ఫింగ్: సోషల్ మీడియా ఖాతాల్లోని వ్యక్తిగత ఫోటోలను అనుమతి లేకుండా సేకరించి, వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం లేదా నకిలీ ఖాతాలు సృష్టించడం సర్వసాధారణమైంది.
ఆన్‌లైన్ మోసాలు: పార్ట్‌టైం ఉద్యోగాలు, ఆన్‌లైన్ రేటింగ్‌లు ఇచ్చి డబ్బు సంపాదించే పథకాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ లక్కీ డ్రాల పేరుతో అమాయక మహిళల నుంచి డిపాజిట్లు వసూలు చేసి ముంచేసే సైబర్ కేటుగాళ్లు ఎక్కువయ్యారు.
సైబర్ స్టాకింగ్: ఆన్‌లైన్‌లో మహిళల కదలికలను నిరంతరం గమనించడం, అసభ్యకర సందేశాలు పంపడం, లేదా సోషల్ మీడియా కామెంట్లలో వేధింపులకు గురిచేయడం వల్ల మహిళలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
భద్రత కోసం పాటించాల్సిన సూత్రాలు
పైవ్రసీ సెట్టింగ్స్: మీ సోషల్ మీడియా ఖాతాల (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్) పైవ్రసీని ‘పైవ్రేట్’ లేదా ‘ఫ్రెండ్స్ ఓన్లీ’గా ఉంచుకోవాలి.
లింక్‌లకు దూరంగా: ఉచిత కానుకలు, గిఫ్ట్ వోచర్లు, లేదా అధిక రాబడి వచ్చే పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో వాట్సాప్, మెసేజ్‌లలో వచ్చే అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయకూడదు.
లొకేషన్ షేరింగ్‌లో జాగ్రత్త: మీరు ఉన్న ప్రస్తుత లొకేషన్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం సురక్షితం కాదు.
చట్టపరమైన రక్షణ
ఒకవేళ సైబర్ నేరానికి గురైతే విషయం బయటకు తెలిస్తే ఏమవుతుందోనని మౌనంగా ఉండకూడదు. వెంటనే 1930 అనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు