Share News

డెంగ్యూకు దడ పుట్టేలా

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:32 AM

చాలా మంది డెంగ్యూ నుంచి త్వరగానే కోలుకోగలుగుతారు. కానీ కొందరు డెంగ్యూ, డెంగ్యూ హెమరేజిక్‌ ఫీవర్‌ లేదా డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ తాలూకు లక్షణాల ప్రభావానికి లోనవుతారు. ఈ కోవకు చెందిన వారికి అందించవలసిన వైద్య చికిత్సలు ఏవంటే...

డెంగ్యూకు దడ పుట్టేలా

హోమియోపతి

చాలా మంది డెంగ్యూ నుంచి త్వరగానే కోలుకోగలుగుతారు. కానీ కొందరు డెంగ్యూ, డెంగ్యూ హెమరేజిక్‌ ఫీవర్‌ లేదా డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ తాలూకు లక్షణాల ప్రభావానికి లోనవుతారు. ఈ కోవకు చెందిన వారికి అందించవలసిన వైద్య చికిత్సలు ఏవంటే...

డెంగ్యూలో రక్తనాళాలు దెబ్బతినొచ్చు. లేదా రక్తప్రవాహంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గడం లేదా రక్తం గడ్డకట్టే కణాలు తగ్గడం లాంటివి జరగవచ్చు. ఈ పరిస్థితులు షాక్‌, అంతర్గత రక్తస్రావం, అవయవ వైఫల్యం లేదా మరణానికి దారి తీయవచ్చు. మిగతా వైరల్‌ జ్వరాల మాదిరిగానే డెంగ్యూను నయం చేయడానికి ప్రత్యేకమైన చికిత్సలు, మందులు లాంటివేవీ లేవు. లక్షణాలను తగ్గించి, రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి మందులు తోడ్పడతాయి. విశ్రాంతి తీసుకుంటూ, కంటి నిండా నిద్ర పోవాలి. అలాగే ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాల తీవ్రతను తగ్గించడం కోసం పెయిన్‌ కిల్లర్స్‌ వాడుకోవాలి.

వీళ్లు అప్రమత్తం

చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మధుమేహులు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు, రక్తహీనతతో బాధపడుతున్న వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా రెండు నుంచి మూడు రోజులకు మించి జ్వరం వేధిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా డెంగ్యు జ్వరాలను నివారించుకోవచ్చు.

హోమియో ప్రభావం

డెంగ్యూ జ్వర లక్షణాలను తగ్గించడానికీ, రోగనిరోధక శక్తిని పెంచడానికీ హోమియోలో కొన్ని నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మందులను అర్హులైన వైద్యుల పర్యవేక్షణలోనే వాడుకోవాలి. రోగి శరీర తత్వం, జ్వరం తీవ్రత, నొప్పులు, ఇతరత్రా లక్షణాల ఆధారంగా వైద్యులు హోమియో మందులను సూచిస్తారు. శరీరం కోల్పోయే శక్తిని సమకూర్చడంతో పాటు తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు పడిపోకుండా నిరోధించేలా రోగనిరోధకశక్తిని బలపరిచే హోమియో మందులు వాడుకోవడం వల్ల డెంగ్యూ జ్వరం నివారణ సాధ్యపడుతుంది.


సమర్థమైన మందులున్నాయి

ఎకొనైట్‌, ఆర్సెనికం ఆల్బమ్‌, బెల్లడోనా, బ్రయోనియా, క్రొటాలస్‌, చైనా, యుపటోరియం, పర్ఫ్‌, ఫెర్రమ్‌ ఫాస్‌, జెల్సీనియం, రుస్టాక్స్‌ మందులు డెంగ్యు జ్వరాన్ని నివారిస్తాయి. ప్రత్యేకించి యుపటోరియం పర్ఫ్‌ డెంగ్యూ జ్వరానికి ప్రత్యేక ఔషథం.

డాక్టర్‌ గన్నం రాజు దుర్గాప్రసాద్‌ రావు,

హోమియోపతి వైద్యులు,

నిత్య హోమియోపతి,

కుత్బిగూడ, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 05:32 AM