Share News

నీళ్లు తాగట్లేదా..?

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:58 AM

జీవక్రియలు సజావుగా జరగాలంటే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీటిని తాగాలి. అలా తాగని పక్షంలో నీటి అవసరాన్ని తెలుపుతూ శరీరం కొన్ని ప్రత్యేకమైన సంకేతాలిస్తుంది. ఆ వివరాలు...

నీళ్లు తాగట్లేదా..?

జీవక్రియలు సజావుగా జరగాలంటే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీటిని తాగాలి. అలా తాగని పక్షంలో నీటి అవసరాన్ని తెలుపుతూ శరీరం కొన్ని ప్రత్యేకమైన సంకేతాలిస్తుంది. ఆ వివరాలు...

  • చాలాసేపటి వరకు నీటిని తాగకపోతే గొంతు, నోరు ఎండిపోతాయి. ఇలా దాహంగా అనిపించినప్పుడు శరీరంలో నీటిశాతం చాలావరకు తగ్గిందని అర్థం. వెంటనే రెండు గ్లాసుల నీటిని తాగడం మంచిది.

  • మూత్రం తక్కువగా ముదురు పసుపు రంగులో కనిపిస్తే శరీరంలో నీటి శాతం తగ్గిందని తెలుసుకోవాలి. దీనివల్ల మూత్రాశయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

  • నోట్లో తగినంత లాలాజలం ఉత్పత్తి కాకపోయినా, పెదవులు పొడిబారి పగిలి రక్తం చిందుతున్నా, నాలుక ఎండిపోతున్నట్లనిపించినా వెంటనే మంచినీటిని తాగాలి.

  • మంచినీటిని సరిగా తాగకపోతే మెదడుకు రక్తప్రసరణ మందగిస్తుంది. దీంతో తలనొప్పి, కళ్లు తిరగడం, కండరాల నొప్పులు, నీరసం, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా వెంటనే గ్లాసు నీటిని తాగడం శ్రేయస్కరం.

  • శరీరంలో నీటిశాతం తగ్గితే మెదడు చురుకుదనాన్ని కోల్పోతుంది. దీంతో ఏకాగ్రత తగ్గుతుంది. ఎప్పుడూ చికాకుగా అనిపిస్తుంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా వెంటనే మంచినీటిని తాగాలి.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 04:58 AM