Share News

తాగునీళ్లలో రసాయనాలు

ABN , Publish Date - May 12 , 2026 | 04:14 AM

మగ కప్పలను గుడ్లు పెట్టే ఆడ కప్పలుగా మార్చే రసాయనం మన మంచి నీళ్ల కుళాయిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇది చదవండి...

తాగునీళ్లలో రసాయనాలు

మీకు తెలుసా?

మగ కప్పలను గుడ్లు పెట్టే ఆడ కప్పలుగా మార్చే రసాయనం మన మంచి నీళ్ల కుళాయిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇది చదవండి...

‘ఆట్రాజైన్‌’... వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించే కలుపు సంహారిణి. పంటల మీద ఈ రసాయనాన్ని చిలకరించిన తర్వాత అది నేలలోకి ఇంకిపోయి, భూగర్భజలాల్లో కలిసిపోయి, నేరుగా మన కుళాయి నీట్లోకి చేరుకుంటుంది. ఈ రసాయనం జీవరాశుల జీవక్రియలను ప్రభావితం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. అట్రాజైన్‌కు బహిర్గతమైన మగ కప్పలు, ఆడ లక్షణాలను సంతరించుకుని, గుడ్లను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టడాన్ని పరిశోధకులు గమనించారు. ఆ రసాయనాలు హార్మోన్‌ సంకేతాలను అడ్డుకున్నప్పుడు ఆ ప్రభావాలు శాశ్వతంగా, తిరిగి సరిదిద్దలేనంత ప్రమాదకరంగా మారిపోతాయి. సంప్రదాయ వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు ఈ తరహా సింథటిక్‌ వ్యవసాయ రసాయనాలను వడగట్టడానికి తగ్గట్టుగా రూపొందలేదు. ఈ ప్లాంట్లు కేవలం బ్యాక్టీరియాను తొలగించి, క్లోరిన్‌ను జోడించడానికి తగినట్టుగానే రూపొందాయి. అట్రాజైన్‌తో పాటు కొన్ని వేల సింథటిక్‌ రసాయనాలు మన పర్యావరణంలో కలుస్తున్నాయి. దీర్ఘకాలంలో మానవ శరీరం మీద కనబరిచే ప్రభావాలకు సంబంధించి వీటిలోని పలు రసాయనాల మీద పరీక్షలు జరపలేదు. కాబట్టి సమర్థవంతమైన వాటర్‌ ఫిల్టర్లను ఎంచుకోవడంతో పాటు, కలుషిత భూగర్భజలాలకు దూరంగా ఉండే నివాస ప్రాంతాలను ఎంచుకోవడం అత్యవసరం.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 12 , 2026 | 04:14 AM