Share News

ఆరోగ్యాన్నిచ్చే అలవాట్లు

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:41 AM

రోజంతా చురుకుగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మంచి అలవాట్లు అలవరచుకోవాల్సిందే! అవేంటంటే...

ఆరోగ్యాన్నిచ్చే అలవాట్లు

రోజంతా చురుకుగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మంచి అలవాట్లు అలవరచుకోవాల్సిందే! అవేంటంటే...

  • ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీరు తాగాలి. దీనివల్ల జీవక్రియలు వేగవంతమవుతాయి. జీర్ణాశయం, పేగులు, మూత్రపిండాలు శుభ్రపడతాయి.

  • రాత్రి పడుకునేముందు, ఉదయం నిద్ర లేచిన తరువాత కనీసం అయిదు నిమిషాలపాటు ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. దీనివల్ల నాడీవ్యవస్థ ఉపశమనం పొందుతుంది. శరీరానికి ఒత్తిడి తగ్గుతుంది.

  • ఉదయం పూట పావుగంటసేపు ఎండలో గడపాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన డి విటమిన్‌ అందుతుంది.

  • ఎముకలు, కండరాలు, కీళ్లు బలోపేతమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

  • రోజూ కొంతసేపు పుస్తకాలు చదువుతుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

  • రోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరంలో కదలికలు పెరుగుతాయి. బద్దకం, బడలిక తొలగి రోజంతా ఆనందంగా అనిపిస్తుంది.

  • ఉదయం, రాత్రి సమయాల్లో ఫోన్‌కు దూరంగా ఉండాలి. అప్పుడే బంధాలు బలపడి మానసిక స్థైర్యం చేకూరుతుంది.

  • రోజూ తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరి చేరవు.

  • పలు సందర్భాల్లో ఏర్పడే ఆలోచనలు, మనసులోని భావాలను ఓ పుస్తకంలో రాయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం, చక్కని ప్రణాళిక విధానం అలవడతాయి.

ఇవి కూడా చదవండి:

వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

Updated Date - Feb 28 , 2026 | 12:41 AM