బాదం పప్పులు తింటే...
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:10 AM
రోజూ కొన్ని బాదం పప్పులను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం...
రోజూ కొన్ని బాదం పప్పులను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం...
బాదం పప్పుల్లో క్యాలరీలు చాలా తక్కువ. పీచు, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ప్రొటీన్లు, మెగ్నీషియం, కాల్షియం తదితర పోషకాలు అధికం. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నిర్మూలించి రక్తపోటును నియంత్రిస్తాయి.
వీటిని తిన్న తరువాత చాలాసేపటి వరకు ఆకలి అనిపించదు. ఇతర చిరుతిళ్లవైపు మనసు మళ్లదు కాబట్టి శరీర బరువు క్రమంగా నియంత్రణలోకి వచ్చేస్తుంది.
అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల వీటిని తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదు. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
బాదం పప్పుల్లో ఉండే ఇ విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు, అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫెనాల్స్ కలిసి చర్మ కణాలను ఆక్సిడేషన్ బారినుంచి కాపాడతాయి. దీంతో చర్మంపై ముడుతలు, గీతలు, పిగ్మెంటేషన్ మాయమవుతాయి. ముఖం ఛాయగా కాంతివంతంగా కనిపిస్తుంది.
బాదం పప్పులను బాగా నమిలి తింటే ప్రీబయోటిక్‌లా పనిచేసి ప్రేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలను పెంచుతాయి. దీంతో మలబద్దకం తదితర సమస్యలు రావు.
మధ్య వయసు మహిళలు రోజూ అల్పాహారంలో బాదం పప్పులను చేర్చుకుంటే వారికి ఆస్టియోపొరాసిస్, మెనోపాజ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెరిగే పిల్లలకు వీటిని తినిపించడం వల్ల వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం