పేపర్ బ్యాగ్స్‌తో ఇలా...
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:28 AM
ఆన్‌లైన్ షాపింగ్ వల్ల ఇంట్లోకి వచ్చే మందమైన పేపర్ బ్యాగ్స్‌ను పడేయకుండా వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం...
ఆన్‌లైన్ షాపింగ్ వల్ల ఇంట్లోకి వచ్చే మందమైన పేపర్ బ్యాగ్స్‌ను పడేయకుండా వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం...
పేపర్ బ్యాగ్స్‌కు పై భాగంలో వాటి చుట్టూ అందమైన లేస్ లేదా చక్కని డిజైన్ ఉన్న వస్త్రాన్ని అతికించి స్టోరేజ్ బాస్కెట్లు తయారు చేయవచ్చు. వీటిలో పిల్లలు ఆడుకునే బొమ్మలు, మేకప్ సామాగ్రి, చిన్న చిన్న వస్తువులు సర్ది అరల్లో పెడితే ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
పేపర్ బ్యాగ్స్ మీద చిన్న స్టిక్కర్లు లేదా నచ్చిన బొమ్మలు అంటించి వాటితో వాల్ ఆర్గనైజర్‌ను తయారుచేసి వంటింట్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో కాపీ, బూస్ట్, మసాలాలు, దినుసులు... తదితరాల సాచెట్లు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లు, చెంచాలు, గిన్నెలు, చెక్క గరిటెలు, పిండి వంటలు చేయడానికి ఉపయోగించే తేలికపాటి సామాగ్రిని సర్దుకోవచ్చు. టిష్యూ పేపర్లు, కిచెన్ టవల్స్‌ను కూడా చేతికి అందేలా పెట్టుకోవచ్చు.
వీటిపై అందంగా డ్రాయింగ్ వేసి ఫ్యాన్సీ రిబ్బన్లు, డ్రై ఫ్లవర్స్ అతికించి ట్రెండీ గిఫ్ట్ బ్యాగ్‌లు తయారుచేయవచ్చు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండుగలప్పుడు బహుమతులు ఇవ్వడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు.
చదువుకునే పిల్లలకు ఉపయోగపడేలా పెన్ స్టాండ్‌లు తయారుచేయవచ్చు. బుక్ కవర్స్‌గా వాడుకోవచ్చు. పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్‌లు ప్రయత్నించవచ్చు. ఈ పనులన్నింటినీ పిల్లలకు అప్పజెబితే వారిలో సృజనాత్మకత పెరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News