Share News

కొత్తిమీర తాజాగా

ABN , Publish Date - May 06 , 2026 | 04:55 AM

కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉండాలంటే ఇలా చేయండి.....

కొత్తిమీర తాజాగా

కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉండాలంటే ఇలా చేయండి...

  • కాడలను కొద్దిగా కత్తిరించిన తరువాత కొత్తిమీరను నీళ్లు నింపిన గాజు సీసాలో నిటారుగా ఉంచాలి. ఆకులపైన వదులుగా ప్లాస్టిక్‌ కవర్‌ను కప్పి ఫ్రిజ్‌లో ఉంచితే పది రోజుల వరకూ కొత్తిమీర తాజాగా ఉంటుంది.

  • కొత్తిమీరను తెచ్చిన వెంటనే మంచి నీటితో కడిగి శుభ్రం చేయాలి. ఆపైన తడి లేకుండా అరబెట్టాలి. తరువాత టిష్యూ పేపర్లో చుట్టి జిప్‌లాక్‌ కవర్‌ లేదా గాలి చొరబడని డబ్బాలో భద్రపరిచి ఫ్రిజ్‌లో పెడితే చాలా రోజుల వరకు కొత్తిమీర తాజాగా ఉంటుంది.

  • ఒక ప్లాస్టిక్‌ బాక్స్‌లో టిష్యూ పేపర్‌ను పరిచి దానిమీద కొత్తిమీరను ఉంచి పైన మరో టిష్యూ పేపర్‌తో పూర్తిగా కప్పాలి. తరువాత మూతపెట్టి బాక్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే ఇరవై రోజులకు పైగా నిల్వ ఉంటుంది.

  • కొత్తిమీరను కాటన్‌ లేదా మస్లిన్‌ గుడ్డలో వదులుగా చుట్టాలి. తరువాత స్టీల్‌ బాక్స్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే చాలా రోజుల వరకు కొత్తిమీర పాడవకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 04:55 AM