Share News

మలబద్దకం రాకుండా ఇలా...

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:46 AM

మలబద్దకాన్ని నిరోధించేందుకు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరి...

మలబద్దకం రాకుండా ఇలా...

మలబద్దకాన్ని నిరోధించేందుకు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరి...

  • పీచు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలను భోజనంలో చేర్చుకోవాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి అజీర్తి, మలబద్దకం లాంటి సమస్యలు తీరుతాయి.

  • ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు.

  • బొప్పాయి, జామ, యాపిల్‌, డ్రై ప్లమ్‌, స్ట్రాబెర్రీ, అరటి పండ్లను తరచూ తింటూ ఉంటే మలబద్దకం దరిచేరదు. పేగులు కూడా శుభ్రంగా ఉంటాయి.

  • రోజూ అరగంటసేపు వ్యాయామం చేస్తే శారీరక శ్రమ కలగడంతోపాటు పేగుల్లో కదలికలు మెరుగుపడి సమస్య తొలగిపోతుంది.

  • ప్రోబయోటిక్స్‌ అధికంగా ఉండే పెరుగు, మజ్జిగలను రోజూ తీసుకుంటే జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు పెరిగి మలబద్దకాన్ని నిరోధిస్తాయి.

  • రోజూ కొద్దిసేపు యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి జీవక్రియలు వేగవంతమవుతాయి. దీంతో జీర్ణాశయం ఆరోగ్యకరమైన రీతిలో పనిచేస్తూ మలబద్దకాన్ని దరిచేరనివ్వదు.

  • ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, నూనె పదార్థాలు, స్వీట్లు, మసాలాలు తగ్గించి జీర్ణ సమస్యలు రాకుండా చూసుకుంటే మలబద్దకం సమస్య ఏర్పడదు.

ఇవి కూడా చదవండి..

ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..

మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..

Updated Date - Jun 15 , 2026 | 02:46 AM