Share News

గొంతులో గరగర అందుకేం

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:51 AM

డాక్టర్‌! గొంతులో ఏదో ఉన్నట్టు అదే పనిగా గొంతును సవరించుకోవాల్సి వస్తోంది. ఇదేదైనా ఇన్‌ఫెక్షన్‌ లక్షణం అయి ఉంటుందా? తగిన సలహా ఇవ్వగలరు!...

గొంతులో గరగర అందుకేం

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! గొంతులో ఏదో ఉన్నట్టు అదే పనిగా గొంతును సవరించుకోవాల్సి వస్తోంది. ఇదేదైనా ఇన్‌ఫెక్షన్‌ లక్షణం అయి ఉంటుందా? తగిన సలహా ఇవ్వగలరు!

- ఓ సోదరి, హైదరాబాద్‌.

గొంతులో ఏదో అడ్డు పడ్డట్టు పదే పదే కొందరు రోజంతా గొంతు సవరించుకుంటూనే ఉంటారు. ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం ఉమ్మిని మింగుతూ ఉండడం, నీళ్లు తాగడం చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘లారింజోఫారింజియల్‌ రిఫ్లక్స్‌’ అని అంటారు. దీనికి పలు కారణాలున్నాయి. అసలు కారణాన్ని కనిపెట్టి, సరిదిద్దుకుంటే, సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.

యాసిడ్‌ రిఫ్లక్స్‌: పొట్టలోని ఆమ్లాల ఆవిరులు గొంతులోకి తన్నుకొచ్చి, గొంతులో అసౌకర్యం మొదలవుతుంది. అన్నవాహిక, పొట్టకూ మధ్య ఉండే కనెక్షన్‌ లోపలి లైనింగ్‌ ఎంతో సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆమ్లాల ఆవిరులు అక్కడకు చేరుకున్నప్పుడు గొంతు ఇరిటేషన్‌కు లోనై, గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపిస్తుంది.

పెప్సిన్‌: మన జీర్ణప్రక్రియకు తోడ్పడే పెప్సిన్‌ అనే ఎంజైమ్‌ గొంతులోకి చేరుకోవడం వల్ల కూడా ఇదే తరహా అసౌకర్యం తలెత్తుతూ ఉంటుంది.

మ్యూకస్‌: గొంతు ఇరిటేట్‌ అయినప్పుడు గొంతు లోపలి లైనింగ్‌ను ప్రొటెక్ట్‌ చేయడం కోసం మన శరీరం అదనపు మ్యూక్‌సను ఉత్పత్తి చేస్తుంది. దాంతో గొంతులోకి చేరుకున్న మ్యూక్‌సను క్లియర్‌ చేసుకోడానికి కూడా గొంతును పదే పదే సవరించుకుంటూ ఉండవలసి వస్తుంది.

పరిష్కారం ఇలా...

చాలామంది ఈ సమస్యను గొంతు ఇన్‌ఫెక్షన్‌గా పొరపాటు పడుతూ యాంటీబయాటిక్‌ మందులు వాడుకుంటూ ఉంటారు. ఇంకొందరు అలర్జీ మందులు వేసుకుంటూ ఉంటారు. కొందర్లో అదనంగా దగ్గు కూడా ఉంటుంది. దాంతో రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌గా పొరబడి మందులు వాడుకుంటూ ఉంటారు. అయితే ‘లారింజోఫారింజియల్‌ రిఫ్లక్స్‌’ సమస్యను వదిలించుకోవడం కోసం అందుకు తగిన జీవనశైలి మార్పులను అనుసరించాలి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందే భోజనం ముగించాలి. అవసరాన్ని బట్టి వైద్యులు సూచించే మందులు వాడుకోవాలి. ఎక్కువ ఎత్తుండే దిండ్లు వాడుకోవడం వల్ల, పొట్ట మీద ఒత్తిడి పెరిగి, యాసిడ్‌ రిఫ్లక్స్‌ ఎక్కువవుతుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి. వీలైతే వెడ్జ్‌ పిల్లోస్‌ వాడుకోవాలి.

డాక్టర్‌ చైతన్య

ఇంటర్నల్‌ మెడిసిన్‌ ఫిజీషియన్‌, బెంగుళూరు.

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 03:51 AM