Share News

నీరసం ఇలా దూరం

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:43 AM

పోషకలోపం, శారీరక వ్యాయామం లోపించడం, జీవనశైలి అదుపు తప్పడం లాంటి కారణాల వల్ల నిస్సత్తువ వేఽధించవచ్చు. కాబట్టి నిరంతరంగా నీరసం వేధిస్తుంటే ఈ కింది అంశాలను గమనించుకోవాలి.

నీరసం ఇలా దూరం

హెల్త్‌ వెల్త్‌

పోషకలోపం, శారీరక వ్యాయామం లోపించడం, జీవనశైలి అదుపు తప్పడం లాంటి కారణాల వల్ల నిస్సత్తువ వేఽధించవచ్చు. కాబట్టి నిరంతరంగా నీరసం వేధిస్తుంటే ఈ కింది అంశాలను గమనించుకోవాలి.

ఆహారం ఇలా: శక్తిని అందించే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అరటిపండ్లు, బ్రౌన్‌రై్‌స, చేపలు, చిలగడ దుంపలు, గుడ్లు, ఓట్స్‌, క్వినోవా, అవకాడోలను ఆహారంలో చేర్చుకోవాలి.

వ్యాయామం: వ్యాయామంతో శరీరం, మనసు చలాకీగా మారతాయి. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.

చక్కెర: రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతూ, తరుగుతూ ఉంటే, నిస్సత్తువ ఆవరిస్తుంది. ప్రాసె్‌సడ్‌ పదార్థాలను తినడం మానేయాలి. పాలిష్‌ పట్టని బియ్యం, గోధుమలను తీసుకోవాలి.

ప్రొటీన్‌: ప్రొటీన్‌ అధికంగా ఉన్న పదార్థాలను స్నాక్స్‌గా తీసుకోవాలి. ఇందుకోసం యాపిల్‌, పీనట్‌ బటర్‌, ఉడకబెట్టిన గుడ్లు, పాప్‌కార్న్‌, వేయించిన శనగలు తినాలి.

విశ్రాంతి: అలసటగా అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం అవసరం. శరీరానికి సరిపడా విశ్రాంతి దక్కకపోయినా, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి.

విటమిన్‌ డి: విటమిన్‌ డి లోపం కూడా నిస్సత్తువకు కారణమే! కాబట్టి వైద్యుల సలహా మేరకు డి విటమిన్‌ లోపాన్ని పరీక్షించుకుని సప్లిమెంట్‌ రూపంలో తీసుకోవాలి. అలాగే, ఉదయం, సాయంకాలపు నీరెండలో కనీసం 15 నిమిషాల పాటైనా గడుపుతూ ఉండాలి.

సంగీతం: శ్రావ్యమైన సంగీతంలో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని చలాకీగా ఉంచడానికి తోడ్పడతాయి. కాబట్టి రోజులో కొంత సేపు నచ్చిన సంగీతం వినాలి.

చన్నీళ్ల స్నానం: చల్లదనం కండరాలను బలపరుస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది. కాబట్టి చల్లని నీటితో స్నానం చేస్తూ ఉండాలి.

నవ్వడం: నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే నిస్సత్తువ కూడా దూరమవుతుంది. అందుకోసం స్నేహితులతో సరదా సమయం గడపడం, పిల్లలతో ఆడుకోవడం, కామెడీ సినిమాలు, షోలు చూడడం చేయాలి.

నీళ్లు: సరిపడా నీళ్లు తాగకపోయినా నిస్సత్తువ వేధిస్తుంది. కాబట్టి రోజులో రెండు నుంచి మూడు లీటర్లకు సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.

కాఫీ: పరిమితంగా కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాఫీలోని కెఫీన్‌ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.

వాసనలు: పెప్పర్‌మింట్‌, దాల్చిన చెక్క, నిమ్మ, రోజ్‌మేరీ ఎసెన్షియల్‌ నూనెలను డిఫ్యూజర్‌లో వేసి వాసనలు పీల్చడం వల్ల ఫలితం ఉంటుంది.

నిద్ర: 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. నిద్రలేమి బడలికను కలిగిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 03:43 AM