Share News

వీటితో క్యాన్సర్‌ ఖాయం

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:19 AM

ఏమాత్రం ప్రమాదకరమైనవి కావని మనం భ్రమించే కొన్ని అంశాలు క్యాన్సర్‌ కారకాలు కావచ్చు. అవేంటంటే...

వీటితో క్యాన్సర్‌ ఖాయం

అప్రమత్తం

ఏమాత్రం ప్రమాదకరమైనవి కావని మనం భ్రమించే కొన్ని అంశాలు క్యాన్సర్‌ కారకాలు కావచ్చు. అవేంటంటే...

సెంటెడ్‌ క్యాండిల్స్‌: సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌, బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌ అనే రసాయనాలను వెదజల్లుతాయి. క్యాన్సర్‌ కారకాలైన వీటిని పీల్చుకోవడం వల్ల, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు రెట్టింపవుతుంది.

నాన్‌స్టిక్‌: ఈ వంట పాత్రలు విషపూరితమైన ఎఫ్‌డిఔ రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు మన శరీరంలో పేరుకుపోయి, థైరాయిడ్‌, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్‌ అవకాశాలను పెంచుతాయని పరిశోధనల్లో తేలింది.

మైక్రోవేవ్‌ పాప్‌కార్న్‌ బ్యాగ్స్‌: ఈ బ్యాగ్‌ లైనింగ్‌లో పిఎ్‌ఫఔ రసాయనాలుంటాయి. ఇవి వేడికి ఆవిరైపోతాయి. కాబట్టి మైక్రోవేవ్‌లో వేడి చేసిన పాప్‌కార్న్‌ వాయువులను పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

టాల్కమ్‌ పౌడర్‌: బేబీ పౌడర్‌, బాడీ పౌడర్లలో ఆస్బెస్టాస్‌ కలుషితాలుంటాయి. ఇవి అండాశయ క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయి

ప్రాసెస్డ్‌ మీట్‌: బేకన్‌, సాసేజ్‌, హాట్‌ డాగ్స్‌ను సిగరెట్ల మాదిరిగా, గ్రూప్‌ 1 క్యాన్సర్‌ కారకాలుగా గుర్తించారు. వీటితో పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ

ఎయుర్‌ ఫ్రెష్‌నర్స్‌: ఇవి థాలేట్స్‌, ఫార్మాల్డిహైడ్స్‌ను గాల్లోకి విడుదల చేస్తాయి. దీర్ఘకాలం పాటు వీటికి బహిర్గతమైతే, శ్వాసకోస క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ అవకాశాలు పెరుగుతాయి

ఇవి కూడా చదవండి..

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

Updated Date - Feb 10 , 2026 | 01:19 AM