జలుబు మతలబు
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:36 AM
జలుబు చేస్తే, అప్పటివరకూ లేని మ్యూకస్ భారీ పరిమాణంలో ముక్కు నుంచి కారడం మొదలుపెడుతుంది. బలంగా ముక్కు చీదినా, తిరిగి ఐదు నిమిషాల్లో మళ్లీ...
ఇదీ సంగతి
జలుబు చేస్తే, అప్పటివరకూ లేని మ్యూకస్ భారీ పరిమాణంలో ముక్కు నుంచి కారడం మొదలుపెడుతుంది. బలంగా ముక్కు చీదినా, తిరిగి ఐదు నిమిషాల్లో మళ్లీ పేరుకుంటూ ఉంటుంది. ఇంతకూ అంత మ్యూకస్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు?
మ్యూకస్ సాంకేతిక నామం మ్యూసిన్. మన శ్వాసమార్గాల లోపలి పొరలు, మ్యూకస్ అనే జిగురుతో కూడిన జెల్‌తో కప్పబడి ఉంటాయి. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవడం కోసం మనం రోజుకు దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల మ్యూకస్‌ను ఉత్పత్తి చేస్తూ ఉంటాం! అయితే ఇంతటి మ్యూకస్‌నూ మనం మనకు తెలియకుండానే మింగేస్తూ ఉంటాం! వైరస్ దాడి చేసినప్పుడు, మన వ్యాధినిరోధక వ్యవస్థ ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రేరేపిస్తుంది. దాంతో మన శ్వాసమార్గాల్లోని గోబ్లెట్ కణాలు ఎక్కువ మోతాదుల్లో మ్యూకస్‌ను ఉత్పత్తి చేయడం మొదలుపెడతాయి. అయితే అదంతా చీమిడి కాదు. దాన్లో రక్తనాళాలు విడుదల చేసిన నీరు, రోగనిరోధకశక్తితో చనిపోయిన మృత తెల్ల కణాలు, నాశనమైపోయిన వైరస్ అణువులు, ఉప్పు, ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఇంతకూ మనం ముక్కు చీదినా, మళ్లీ మళ్లీ మ్యూకస్ ఎందుకు తయారవుతోంది? నిజానికి మనమిక్కడ ట్యాంకును ఖాళీ చేయడం లేదు. కేవలం కన్వేయర్ బెల్టునే శుభ్రపరుస్తున్నాం. ఇన్‌ఫ్లమేషన్ సంకేతాలు అప్పటికీ చురుగ్గానే ఉంటాయి. మన శరీరం కూడా చురుగ్గా కణజాలాల్లోకి ద్రవాన్ని పంపిస్తూ, ఇన్‌ఫెక్షన్ వదిలేవరకూ ప్రతి క్షణం మ్యూకస్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. జలుబు వదలకపోతే మన శరీరం విఫలమైందని అనుకోకూడదు. మన రోగనిరోధక వ్యవస్థ వ్యాధికారక సూక్ష్మజీవులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తోందని అర్థం చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..