కొబ్బరి పెరుగు తిందాం...
ABN , Publish Date - May 06 , 2026 | 04:57 AM
ఎండాకాలంలో ఒంటికి చలువదనాన్ని అందించడంలో ముందుంటుంది కొబ్బరి పెరుగు. పాలు, పాల ఉత్పత్తులు సయించని వారికి ఇది చక్కని ఎంపిక. కొబ్బరి పెరుగును...
ఎండాకాలంలో ఒంటికి చలువదనాన్ని అందించడంలో ముందుంటుంది కొబ్బరి పెరుగు. పాలు, పాల ఉత్పత్తులు సయించని వారికి ఇది చక్కని ఎంపిక. కొబ్బరి పెరుగును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...
కొబ్బరి పెరుగును నేరుగా తినవచ్చు లేదంటే అన్నంతోపాటు తీసుకోవచ్చు. సలాడ్లు, స్మూతీలలో కలుపుకోవచ్చు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే లాక్టోబాసిల్లస్ అనే ప్రోబయోటిక్స్... పేవుల్లో మంచి బ్యాక్టీరియాల వృద్ధికి తోడ్పడుతుంది.
సాధారణ పెరుగుతో పోలిస్తే ఈ కొబ్బరి పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు చాలా తక్కువ. కానీ సంతృప్త కొవ్వు శాతం అధికం. కాబట్టి కొబ్బరి పెరుగును మితంగా తీసుకోవడం మంచిది.
కొబ్బరి పెరుగులో మీడియం- చెయిన్ ట్రైగ్లిజరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ లాంటి ఖనిజాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఎముకల సాంద్రతను కాపాడతాయి.
కొబ్బరి పెరుగును తరచూ తీసుకోవడం వల్ల దానిలోని లారిక్ ఆమ్లం... శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
లాక్టోస్ అలర్జీ ఉన్నవారు, వీగన్ డైట్ ఫాలో అయ్యేవారు ప్రత్యామ్నాయంగా ఈ కొబ్బరి పెరుగును తీసుకోవచ్చు.
ఎలా తయారు చేయాలంటే... మిక్సీ గిన్నెలో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుం వేసి ఒక కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆపైన పలుచని గుడ్డ సహాయంతో మరో గిన్నెలోకి కొబ్బరిపాలు వడబోయాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి కొబ్బరిపాలను గోరువెచ్చగా వేడిచేయాలి. తరువాత అందులో ప్రోబయోటిక్ క్యాప్సూల్ పౌడర్ వేసి కలిపి మూత పెడితే ఏడు గంటల్లో పెరుగు తయారవుతుంది.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్