వేసవి తాపానికి విరుగుడు కొబ్బరినీరు
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:24 AM
వేసవిలో శరీరానికి ప్రాణం పోసే ‘అమృతం’ కొబ్బరినీళ్లు. కేవలం దాహం తీర్చడమే కాదు, ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు...
వేసవిలో శరీరానికి ప్రాణం పోసే ‘అమృతం’ కొబ్బరినీళ్లు. కేవలం దాహం తీర్చడమే కాదు, ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.
నేచురల్ హైడ్రేషన్: కొబ్బరినీరు ఒక సహజ సిద్ధమైన ‘ఐసోటోనిక్’ డ్రింక్. ఇది శరీరానికి చాలా వేగంగా తేమను అందిస్తుంది.
ఎలకో్ట్రలైట్ల నిధి: కొబ్బరినీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం వంటి కీలక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
శరీరానికి చలువ: కొబ్బరినీరు శరీర అంతర్గత ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఎండదెబ్బ వల్ల వచ్చే తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, నీరసం వంటి లక్షణాలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
జీర్ణక్రియకు మేలు: కొబ్బరినీళ్లలో ఉండే బయోయాక్టివ్ ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది కడుపులోని మంటను తగ్గించి మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
తక్షణ శక్తి: కొబ్బరినీళ్లలోని సహజ చక్కెరలు, మెగ్నీషియం శరీరానికి స్థిరమైన, సహజమైన శక్తిని ఇస్తాయి.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్