కాక్‌టెయిల్ ఇయర్ రింగ్స్
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:46 AM
ప్రత్యేకమైన ఫంక్షన్లు, ఈవెనింగ్ పార్టీల్లో ధరించే ఆకర్షణీయమైన చెవి పోగులనే ‘కాక్‌టెయిల్ ఇయరింగ్స్’గా పరిగణిస్తుంటారు. ఇవి పెద్దగా ఉంటూ ముఖానికి ప్రత్యేకమైన మెరుపుని అందిస్తాయి. వీటి తయారీలో పెద్ద సైజు వజ్రాలు...
ప్రత్యేకమైన ఫంక్షన్లు, ఈవెనింగ్ పార్టీల్లో ధరించే ఆకర్షణీయమైన చెవి పోగులనే ‘కాక్‌టెయిల్ ఇయరింగ్స్’గా పరిగణిస్తుంటారు. ఇవి పెద్దగా ఉంటూ ముఖానికి ప్రత్యేకమైన మెరుపుని అందిస్తాయి. వీటి తయారీలో పెద్ద సైజు వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, కెంపులు, కుందనాలు, పోల్కీలను ఉపయోగిస్తుంటారు. బంగారం, ప్లాటినం, స్టెర్లింగ్ సిల్వర్, వన్‌గ్రామ్ గోల్డ్, పంచలోహాలతో రూపొందించిన కాక్‌టెయిల్ ఇయరింగ్స్‌ను యువతులు అమితంగా ఇష్టపడుతున్నారు. వీటిని వెస్ట్రన్ గౌన్లు, కాక్‌టెయిల్ డ్రెస్‌లు, మోడరన్ డిజైనరీ శారీస్, సింపుల్ లెహంగాలమీద ధరించవచ్చు. శిరోజాలను పైకి ముడివేసినట్లుండే బన్ స్టయిల్స్, వన్ సైడ్ హెయిర్ స్టయిల్స్‌ను ప్రయత్నిస్తే ఈ ఇయరింగ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. మెడలో ఎలాంటి నెక్లెస్, చోకర్ వేసుకోకపోవడమే మంచిది. బడ్జెట్ ధరల్లో లభించే ఆర్టిఫీషియల్, బీడెడ్ డిజైన్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఇలా అన్ని వర్గాల మహిళలను ఆకర్షిస్తున్న కాక్‌టెయిల్ ఇయరింగ్స్‌పై ఓ లుక్కేద్దామా...
లిక్విడ్ మెటల్ డిజైన్స్
ప్రవహిస్తున్న నీటిని తలపించే డిజైన్లు, స్కల్ప్చరల్ మోడల్స్‌ను యువతులు ఎక్కువగా కొంటున్నారు. ఇవి సింపుల్‌గా కనిపిస్తూనే వెస్ట్రన్ డ్రెస్‌లపై ట్రెండీ లుక్‌నిస్తాయి.
గ్రేజింగ్ డాంగ్లర్స్
ఇవి పొడవుగా కాలర్ బోన్‌ను తాకుతూ ఉంటాయి. సన్నగా మెరిసే చెయిన్స్, హుక్‌లు, ఏడీ స్టోన్స్, చిన్న సైజు పోల్కీలు, అందమైన క్రిస్టల్స్ వీటి ప్రత్యేకత. ఈవెనింగ్ లేదా నైట్ పార్టీల్లో వీటిని పెట్టుకుంటే ఎలిగెంట్ లుక్ వస్తుంది. సీక్వెన్స్ వర్క్, జర్దోసీ వర్క్, లేస్ వర్క్‌లతో కూడిన క్రేప్, జార్జెట్, షిఫాన్ చీరల మీద ఇవి అందంగా సూటవుతాయి.
ఓవర్ సైజ్డ్ స్టడ్స్
ఇవి చెవి తమ్మెను పూర్తిగా కప్పేస్తాయి. గుండ్రంగా, ఓవెల్ లేదా హార్ట్ షేప్‌ల్లో గ్లాసీగా మెరుస్తుంటాయి. వీటిలో అంతర్గతంగా రంగు రంగుల తరంగాల మాదిరి డిజైన్లను కూడా రూపొందిస్తుంటారు. నైట్ పార్టీల్లో ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లపై ఇవి అలా్ట్ర మోడరన్ వైబ్‌ని సృష్టిస్తాయి.
కలర్‌ఫుల్ డ్రాప్‌లెట్స్
భిన్నమైన ఆకారాల్లో ఉండే బారోక్ పెరల్స్, పచ్చలు, కెంపులు, నీలాలు, క్రిస్టల్స్ తదితరాలను డ్రాప్‌లెట్స్‌గా రూపొందించిన జుంకాలు రాయల్ లుక్‌నిస్తాయి. చెవి తమ్మె మీద అందంగా అమరే చిన్న స్టడ్ దాని నుంచి వేలాడే సన్నని చెయిన్ కలిసి డ్రాప్‌లెట్స్‌ను ప్రత్యేకంగా మార్చేస్తాయి. అన్ని రకాల ట్రెడిషనల్, మోడరన్, వెస్ట్రన్ డ్రెస్‌లపై అందంగా నప్పుతాయి.
మిక్స్‌డ్ మెటల్ కఫ్స్
గోల్డ్, సిల్వర్ ఫినిషింగ్‌లతో కలిసిన సరికొత్త మెటల్ డిజైనరీ కఫ్స్.. స్టాకింగ్ స్టయిల్‌గా పేరు పొందాయి. ఇవి సింపుల్‌గా ఉండే ఫ్యాషనబుల్ డ్రెస్‌లపై చక్కగా సూటవుతాయి.
ఇవి కూడా చదవండి..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ
కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..