లవంగాల నీటిని తాగితే...
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:29 AM
ఒక గ్లాసు నీటిలో నాలుగైదు లవంగాలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
ఒక గ్లాసు నీటిలో నాలుగైదు లవంగాలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
జీర్ణాశయంలో జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. తిన్న ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకంలాంటి సమస్యలు తలెత్తవు.
జీవక్రియల వేగం పెరుగుతుంది. దీంతో శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వులు కరిగి బరువు తగ్గుతారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకవు.
లవంగాలలో యూజినాల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కండరాల వాపు, కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలను నివారిస్తాయి. నాలుక పూత, చిగుళ్లవాపు, దంత సమస్యలు, నోటి దుర్వాసన తొలగిపోతాయి.
శరీరంలో చేరే విషపదార్థాలన్నీ బయటికి విసర్జితమవుతాయి. దీంతో కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది.
శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం బెడద తప్పుతుంది.
లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మొటిమల బాధను తగ్గిస్తాయి. ముడుతలు, మచ్చలు మాయమై ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..