Share News

లవంగ నూనెతో హెయిర్‌ కేర్‌...

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:26 AM

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఒక్కోసారి విపరీతంగా శిరోజాలు రాలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు లవంగ నూనెతో చిన్న చిట్కాలు పాటిస్తే జుట్టు ...

లవంగ నూనెతో హెయిర్‌ కేర్‌...

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఒక్కోసారి విపరీతంగా శిరోజాలు రాలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు లవంగ నూనెతో చిన్న చిట్కాలు పాటిస్తే జుట్టు రాలే సమస్య తీరుతుంది.

అవేంటంటే...

  • చిన్న గిన్నెలో నాలుగు చెంచాల లవంగ నూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. మునివేళ్లతో ఈ నూనెను కొద్దికొద్దిగా తీసుకుంటూ తలంతా మర్దన చేయాలి. లవంగాల్లో ఉండే యూజెనాల్‌ సమ్మేళనాలు.. మాడుమీద రక్తప్రసరణను పెంచుతాయి. దీంతో కుదుళ్లు గట్టిపడి శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.

  • లవంగ నూనెలో యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. రోజూ రాత్రి పడుకునే ముందు చెంచా లవంగ నూనెను తలకు రాసుకుంటూ ఉంటే చుండ్రు సమస్య తీరుతుంది. ఇందులో ఉండే పోషకాలు.. శిరోజాలు నెరిసే సమస్యను తగ్గిస్తాయి.

  • చిన్న గిన్నెలో చెంచా ఆముదం, చెంచా లవంగ నూనె వేసి బాగా కలిపి తలకు పట్టించాలి. గంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే శిరోజాలు తేమతో నిండి నల్లగా మెరుస్తుంటాయి.

  • లవంగ నూనె తయారీ: ఆరు లవంగాలను కొద్దిగా వేడిచేసి మెత్తటి పొడిలా చేయాలి. చిన్న గాజు సీసాలో వంద గ్రాముల కొబ్బరి నూనెను తీసుకుని అందులో లవంగాల పొడి వేసి బాగా కలిపి గట్టిగా మూత బిగించాలి. ఇలా వారంపాటు ఉంచి ఆపైన తలకు రాసుకుంటే మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి..

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు

Updated Date - Mar 12 , 2026 | 04:26 AM