Share News

మట్టికుండ నీరు మరింత చల్లగా..

ABN , Publish Date - May 04 , 2026 | 01:00 AM

వేసవిలో చాలామంది ఫ్రిజ్‌ నీళ్ల కంటే మట్టికుండ నీటికే ప్రాధాన్యం ఇస్తారు. ఎండలు మరీ ఎక్కువగా...

మట్టికుండ నీరు మరింత చల్లగా..

వేసవిలో చాలామంది ఫ్రిజ్‌ నీళ్ల కంటే మట్టికుండ నీటికే ప్రాధాన్యం ఇస్తారు. ఎండలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కుండలోని నీరు ఆశించినంత చల్లగా ఉండదు. అలాంటప్పుడు ఈ చిన్న సైంటిఫిక్‌ చిట్కాను పాటించి చూడండి.

  • ఒక వెడల్పాటి పళ్లెంలో లేదా గంపలో ఇసుకను పోయండి. ఆ ఇసుకను నీటితో బాగా తడిపి దానిపై కుండను ఉంచండి. ఇసుకలోని తేమ కుండలోని వేడిని త్వరగా గ్రహించి నీటిని సహజంగా చల్లబరుస్తుంది.

  • కుండచుట్టూ ఒక పాత గోనెసంచి కానీ, మందపాటి కాటన్‌ వస్త్రాన్ని కానీ చుట్టి, దానిని ఎప్పుడూ తడిగా ఉంచండి. బయటి గాలి ఆ తడి వస్త్రానికి తగిలినప్పుడు భాష్పీభవనం ప్రక్రియ జరిగి కుండ లోపలి ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది.

  • నీరు మరింత రీఫ్రెషింగ్‌గా ఉండాలంటే కుండలో కొన్ని పుదీనా ఆకులను కానీ వేయండి. ఇది సహజ సిద్ధమైన ఫ్లేవర్‌ను ఇస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - May 04 , 2026 | 01:00 AM