Share News

పిల్లలకు జ్వరం తగ్గాలంటే...

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:35 AM

ఒక్కోసారి పిల్లలకు జ్వరంతో ఒళ్లు విపరీతంగా వేడెక్కుతుంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

పిల్లలకు జ్వరం తగ్గాలంటే...

ఒక్కోసారి పిల్లలకు జ్వరంతో ఒళ్లు విపరీతంగా వేడెక్కుతుంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

  • ముందుగా థర్మామీటర్‌తో శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలి. 99 డిగ్రీలు మించి ఉంటే ఆలస్యం చేయకుండా పీడియాట్రీషియన్‌ సలహా మేరకు నిర్దేశిత మోతాదులో పారాసిటమాల్‌ సిరప్‌ తాగించాలి.

  • జ్వరం తగ్గని పక్షంలో ఆరు గంటల వ్యవధి తరువాతనే మరో మోతాదు తాగించాలి. అంతకన్నా ముందు తాగిస్తే లివర్‌ ప్రభావితమవుతుంది.

  • సిరప్‌ తాగించిన తరువాత కూడా జ్వరం తగ్గని పక్షంలో.. గోరువెచ్చటి నీటిలో స్పాంజ్‌ లేదా మెత్తటి తువాలును ముంచి గట్టిగా పిండి దానితో శరీరమంతా తుడుస్తూ ఉండాలి. నుదురు, పొట్ట భాగాలమీద తడి గుడ్డను పరచాలి.

  • జ్వరంతో ఉన్నప్పుడు చలి వేస్తుందనే భావనతో డ్రెస్‌ మీదనే స్వెట్టర్‌ వేసి తలకు క్యాప్‌ పెడుతుంటారు. మందపాటి రగ్గులు కప్పుతుంటారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదముంటుంది. అలా చేయకుండా పిల్లలకు వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు వేయాలి. శరీరానికి గాలి తగిలేలా చూడాలి.

  • జ్వరం వల్ల పిల్లలకు ఆకలి తగ్గుతుంది. ఆ సమయంలో బలవంతంగా పాలు తాగించ కూడదు. ఇతర ఆహారపదార్థాలు తినిపించకూడదు. హైడ్రేషన్‌ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. తరచూ మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, సూప్‌లు తాగించాలి. జ్వరం తగ్గిన తరువాత పిల్లలు ‘ఆకలేస్తుందంటూ’ అడిగి మరీ తింటారు.

Also Read:

అక్టోబర్‌ 3న ‘పాన్-IIT AP సమ్మిట్‌ 2026’: సీఎం చంద్రబాబు

తెలంగాణలో మోస్ట్‌ వాంటెడ్‌ మహిళా మావోయిస్టు లొంగుబాటు

Updated Date - Sep 16 , 2026 | 01:35 AM