Share News

చద్దన్నం తిందాం

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:40 AM

శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ రోజంతా చురుకుగా ఉండేందుకు తోడ్పడే అద్భుతమైన అల్పాహారం చద్దనం్న. ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

చద్దన్నం తిందాం

శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ రోజంతా చురుకుగా ఉండేందుకు తోడ్పడే అద్భుతమైన అల్పాహారం చద్దనం్న. ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

  • రాత్రి పూట... మిగిలిన అన్నాన్ని మట్టి కుండలో వేయాలి. అందులో గోరు వెచ్చటి పాలు పోసి కొద్దిగా పెరుగుతో తోడు పెట్టాలి. ఉదయాన్నే ఇందులో తగినంత ఉప్పు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తురుం, ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసి బాగా కలిపితే రుచికరమైన చద్దనం తయారవుతుంది. ఇది అన్ని వయసులవారికి మంచి పోషకాహారం.

  • చద్దన్నంలో లాక్టోబాసిల్లస్‌ అనే ప్రోబయోటిక్‌ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరంలో బి-12 లోపాన్ని నివారిస్తుంది. పోషకాల శోషణను పెంచుతుంది.

  • తరచూ చద్దన్నం తింటుంటే దానిలోని ఎలక్ర్టోలైట్లు.. డీహైడ్రేషన్‌, అలసట, బలహీనతలను నివారిస్తాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, క్లోరైడ్‌, సిలీనియం లాంటి ఖనిజాలు తక్షణ శక్తిని అందిస్తాయి. రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.

  • నరాల బలహీనత, తిమ్మిర్లు, పార్కిన్సన్స్‌ లాంటి సమస్యలకు చద్దన్నం చక్కని పరిష్కారం. ఇతర అల్పాహారాలతో పోలిస్తే దీనిలో కేలరీలు చాలా తక్కువ. శరీరానికి కావాల్సినంత పీచు లభిస్తుంది. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

  • వారానికి రెండుసార్లు చద్దన్నం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియలు వేగవంతమవుతాయి. ఎసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి. కాలేయం ఉత్తేజితమవుతుంది.

Also Read:

అక్టోబర్‌ 3న ‘పాన్-IIT AP సమ్మిట్‌ 2026’: సీఎం చంద్రబాబు

తెలంగాణలో మోస్ట్‌ వాంటెడ్‌ మహిళా మావోయిస్టు లొంగుబాటు

Updated Date - Sep 16 , 2026 | 01:40 AM