ఆముదంతో ఇలా...
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:42 AM
చర్మ సౌందర్యానికి, శిరోజాల సంరక్షణకు ఆముదం ఎలా తోడ్పడుతుందో చూద్దాం...
చర్మ సౌందర్యానికి, శిరోజాల సంరక్షణకు ఆముదం ఎలా తోడ్పడుతుందో చూద్దాం...
కొద్దిగా ఆముదాన్ని అరచేతిలోకి తీసుకుని రెండు చేతులతో రుద్ది శరీరానికి రాసుకుంటే చర్మంపై రక్షణ పొర ఏర్పడుతుంది. ఇది చర్మంలో తేమ నిలిచేలా చేస్తుంది. ఆముదం సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
చిన్న చిన్న గాయాలైనప్పుడు ఆముదం రాస్తే ఆ ప్రదేశాల్లో కణజాలం త్వరగా వృద్ధి పొందుతుంది. గాయాలు త్వరగా మానుతాయి.
ఎర్రగా పొడిబారి నిర్జీవంగా కనిపించే శిరోజాలకు ఆముదాన్ని పట్టిస్తే వారంలో కురులు నల్లగా నిగనిగలాడతాయి. చివర్లు చిట్లడం తగ్గి శిరోజాలు మృదువుగా మారతాయి.
చిన్న గిన్నెలో కొద్దిగా ఆముదాన్ని తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి మాడుకు పట్టిస్తే కుదుళ్లు బలపడతాయి. శిరోజాలు రాలకుండా నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.
పలుచగా ఉన్న కనుబొమలకు ఆముదాన్ని రాస్తే అవి ఒత్తుగా పెరుగుతాయి. అక్కడి చర్మానికి కావాల్సినంత తేమ అంది చుండ్రు సమస్యలు రావు.
చెంచా ఆముదంలో చెంచా జోజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి పగిలిన పెదవులపై రాస్తే ఉపశమనం లభిస్తుంది. రక్తప్రసరణ పెరిగి పెదవులు ఛాయగా మారతాయి.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..