బ్రేక్ తర్వాత మళ్లీ కెరీర్
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:08 AM
పెళ్లి, పిల్లల పెంపకం లేదా కుటుంబ బాధ్యతల కారణాల వల్ల చాలామంది మహిళలు తమ కెరీర్‌కు కొంతకాలం విరామం ఇవ్వాల్సి వస్తుంది. అయితే, కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఉద్యోగంలోకి...
పెళ్లి, పిల్లల పెంపకం లేదా కుటుంబ బాధ్యతల కారణాల వల్ల చాలామంది మహిళలు తమ కెరీర్‌కు కొంతకాలం విరామం ఇవ్వాల్సి వస్తుంది. అయితే, కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఉద్యోగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒకరకమైన భయం, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం సహజం. కానీ సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసం ఉంటే బ్రేక్ తర్వాత కూడా అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మారిన ట్రెండ్‌ను గమనించండి: మీరు విరామం తీసుకున్న సమయానికి, ఇప్పటికీ ఉద్యోగ రంగంలో చాలా మార్పులు వచ్చి ఉండవచ్చు. కాబట్టి మీరు ఎంచుకోబోయే రంగంలో ప్రస్తుతం నడుస్తున్న కొత్త టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్, ట్రెండ్స్ ఏంటో తెలుసుకుని వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఆన్‌లైన్ కోర్సుల ద్వారా అవగాహన పెంచుకోవాలి.
రెజ్యూమె రీ డిజైన్: మీ రెజ్యూమెలో బ్రేక్‌ను దాచడానికి ప్రయత్నించకండి. ‘ఫంక్షనల్ రెజ్యూమే’ విధానాన్ని ఎంచుకుని, మీ గ్యాప్ కంటే మీ నైపుణ్యాలు, గత అనుభవం, బ్రేక్ సమయంలో మీరు నేర్చుకున్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. బ్రేక్ సమయంలో మీరు చేసిన ఫ్రీలాన్స్ వర్క్, వలంటీర్ పనులు లేదా ఆన్‌లైన్ ప్రాజెక్టులను స్పష్టంగా అందులో పేర్కొనండి.
నెట్‌వర్కింగ్ శక్తి: ప్రస్తుత ఉద్యోగ వేటలో నెట్‌వర్కింగ్ అత్యంత కీలకమైనది. లింక్డిన్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయండి. మీ పాత సహోద్యోగులు, స్నేహితులు, పూర్వవిద్యార్థుల సమూహాలలో టచ్‌లో ఉండండి. మీ రంగానికి చెందిన ప్రొఫెషనల్ గ్రూపులలో చేరడం వల్ల కొత్త అవకాశాల గురించి త్వరగా తెలుస్తుంది.
‘రిటర్న్‌షిప్’ ప్రోగ్రాంలు: ఈ రోజుల్లో కార్పొరేట్ కంపెనీలు బ్రేక్ తీసుకున్న మహిళల కోసం ప్రత్యేకంగా ‘రిటర్న్‌షిప్’ లేదా ‘రీ ఎంట్రీ’ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. వీటిద్వారా కొన్ని నెలలపాటు శిక్షణ ఇచ్చి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల సులువుగా మళ్లీ ట్రాక్‌లోకి రావొచ్చు.
కెరీర్ బ్రేక్ అనేది మీ ప్రయాణంలో ఒక చిన్న విరామం మాత్రమే, ముగింపు కాదు. మీ అనుభవం, పరిణతి, నైపుణ్యాలు ఎప్పటికీ వృథా పోవు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే మీ సెకండ్ ఇన్నింగ్స్ మొదటి దానికంటే ఎంతో విజయవంతంగా సాగుతుంది.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి