కారులో ఏసీ పనిచేయట్లేదా..?
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:56 AM
కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ కూలెంట్ తగ్గి ఏసీ పనిచేయకపోవడమనేది దాదాపు అందరికీ అనుభవమయ్యే ఉంటుంది. డ్రైవింగ్ సమయంలో..
కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ కూలెంట్ తగ్గి ఏసీ పనిచేయకపోవడమనేది దాదాపు అందరికీ అనుభవమయ్యే ఉంటుంది. డ్రైవింగ్ సమయంలో ఏసీ నుంచి చల్లని గాలికి బదులు వేడి గాలి వస్తున్నా టెంపరేచర్ గేజ్ పెరిగినా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...
డాష్ బోర్డు మీద టెంపరేచర్ ఎక్కువగా చూపిస్తున్నా, వార్నింగ్ లైట్ వెలిగినా వెంటనే కారును సైడ్‌కు ఆపాలి. అలాంటప్పుడు డ్రైవింగ్ కొనసాగించడం ప్రమాదకరం. ఏసీని కూడా ఆపివేయాలి. హీటర్‌ను ఫుల్ హాట్ మోడ్‌లో పెట్టి ఇంజిన్ వేడిని బయటికి పంపవచ్చు. దీనివల్ల అసౌకర్యంగా అనిపించినప్పటికీ ఇంజిన్ సేఫ్‌గా ఉంటుంది.
కారును ఆపిన వెంటనే ఏ భాగానికీ తగలకుండా బోనెట్‌ను తెరవాలి. ఇంజిన్ చల్లారే వరకూ అంటే అరగంట నుంచి గంట వరకు వేచి చూడాలి. ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్‌ను తెరవకూడదు. అలా తెరిచే ప్రయత్నం చేస్తే ప్రెజర్ వల్ల వేడి కూలెంట్ బయటికి చిమ్మి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇంజిన్ చల్లారిన తరువాత కూలెంట్ రిజర్వాయర్ లెవల్‌ను పరిశీలించాలి. అది ఖాళీగా ఉన్నా, కూలెంట్ తక్కువగా ఉన్నా అదే సమస్యకు కారణంగా భావించవచ్చు. ఇంకా కారు కింద లీక్, రేడియేటర్ డ్యామేజ్, వాటర్ పంప్, థర్మోస్టాట్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి.
కూలెంట్ తక్కువగా ఉంటే యాంటీ ఫ్రీజ్‌తోపాటు డిస్టిల్డ్ వాటర్‌ను సమానంగా నింపాలి. అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా నీళ్లు నింపవచ్చు. కూలెంట్ రిజర్వాయర్ ఖాళీగా ఉంటేమాత్రం కారును డ్రైవ్ చేయకూడదు.
కూలెంట్‌ను నింపిన తరువాత ఇంజిన్‌ను స్టార్ట్ చేసి టెంపరేచర్ గేజ్‌ను పరిశీలిస్తూ ఉండాలి. అది వేగంగా పెరుగుతుంటే మాత్రం కారు నడపకూడదు. కూలెంట్ సరిగా పనిచేయకపోతే ఇంజిన్ వేడెక్కి భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి వెంటనే కారును గ్యారేజ్‌కి తీసుకెళ్లి మెకానిక్‌తో బాగుచేయించాలి.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు