ఈ ముగ్గురికీ క్యాన్సర్ దూరం
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:13 AM
మూడు వర్గాలకు చెందిన వ్యక్తులకు క్యాన్సర్ ముప్పు ఉండదని పరిశోధనలు సూచిస్తున్నాయి...
క్యాన్సర్ కేర్
మూడు వర్గాలకు చెందిన వ్యక్తులకు క్యాన్సర్ ముప్పు ఉండదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
మన శరీరం తీవ్రమైన ఒత్తిడి, అలసట, అసూయ, ద్వేషాలు, మునుపటి రోజు భారాన్ని భరించడానికి ఉద్దేశించినది కాదు. వాటిని ఎప్పటికప్పుడు వదిలించుకోగలిగే అలవాట్లున్న వారు క్యాన్సర్ నుంచి రక్షణ పొందగలుగుతారని వైద్యులు అంటున్నారు. ఆ అలవాట్లున్న వ్యక్తులు ఎవరంటే...
చెమటలు పట్టే వ్యక్తులు: శారీరక శ్రమ చేసేవారికి క్యాన్సర్ ముప్పు తక్కువ. చెమటతో శరీరంలోని క్యాడ్మియం, ఆర్సెనిక్, సీసాలు బయటకు వెళ్లిపోతాయి. ఇవన్నీ కాన్సర్ కారకాలే! రక్తానికి మించి చెమటలోనే ఈ క్యాన్సర్ కారకాలు పది రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు 2021లో చేపట్టిన ఒక అధ్యయనంలో రుజువైంది. చెమటతో వీటిని విసర్జించలేని వారిలో కొవ్వు కణజాలాల్లో ఈ కారకాలు నిల్వ ఉండిపోతాయి. దాంతో కణ విచ్ఛిత్తి మొదలవుతుంది.
భావోద్వేగాలు: ఆగ్రహంతో ఊగిపోయేవారితో పోలిస్తే భావోద్వేగాలను అణచిపెట్టుకునేవారిలోనే క్యాన్సర్ ముప్పు ఎక్కువ. భావోద్వేగాలను నొక్కిపట్టడం వల్ల కార్టిసాల్ స్థాయి పెరిగి, కొత్తగా పుట్టుకొచ్చే క్యాన్సర్ కణాలను చంపే ఎన్‌కె కణాలు నిర్వీర్యమవుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు