క్యాల్షియం లోపిస్తోందా?
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:10 AM
మన శరీరంలో కీలక ఖనిజ లవణమైన క్యాల్షియం దృఢమైన దంతాలు, ఎముకలు, కండర పనితీరు, నాడీ సంకేతాలకు కీలకం. క్యాల్షియం మోతాదు తగ్గినప్పుడు...
ఇదీ నిజం
మన శరీరంలో కీలక ఖనిజ లవణమైన క్యాల్షియం దృఢమైన దంతాలు, ఎముకలు, కండర పనితీరు, నాడీ సంకేతాలకు కీలకం. క్యాల్షియం మోతాదు తగ్గినప్పుడు సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ పోషకాన్ని క్షీణింపజేసే ఆహార పదార్థాల మీద ఓ కన్నేసి ఉంచాలి. అవేంటంటే...
సాఫ్ట్ డ్రింక్స్: శీతల పానీయాల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్యాల్షియం శోషణకు అడ్డుపడుతూ, ఎముకల్లో క్యాల్షియం మోతాదులను తగ్గించేస్తుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
రెడ్ మీట్/ప్రాసెస్డ్ మీట్: సాసేజ్, బేకన్, హాట్ డాగ్స్ లాంటి ప్రాసెస్డ్ మీట్‌తో పాటు రెడ్ మీట్ తీసుకున్నప్పుడు, యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగి, ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పదార్థాలన్నీ క్యాల్షియం శోషణకు అడ్డుపడతాయి. కాబట్టి వీటిని పరిమితం చేయాలి.
స్వీట్స్/బేక్ చేసిన పదార్థాలు: కేక్స్, క్యాండీస్, స్వీట్లు, బిస్కెట్లు అత్యధిక చక్కెర, శుద్ధి చేసిన పిండిపదార్థాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ క్యాల్షియం శోషణను కుంటు పరుస్తాయి. అదనంగా వీటితో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దాంతో ఎముకలు బలహీనపడతాయి.
టీ/కాఫీలు: వీటిలోని కెఫీన్ కూడా క్యాల్షియం శోషణను అడ్డుకుంటుంది. కాబట్టి వీటిని పరిమితం చేయాలి.
మద్యం: మద్యం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. దాంతో ఎముకలు సులభంగా విరుగుతాయి. ఎముకలు దృఢంగా ఉండాలనుకుంటే మద్యానికి దూరంగా ఉండాలి.
నూనె పదార్థాలు: వేయించిన చికెన్, సమోసాలు, పకోడీలు ఎముకలకు హానికరం. వీటిలోని అనారోగ్య కొవ్వులు క్యాల్షియం శోషణ మీద ప్రతికూల ప్రభావాన్ని కనబరిచి, ఎముకలను బలహీనపరుస్తాయి. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలి.
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు