క్యాబేజీ కట్టుతో నొప్పి కట్
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:09 AM
ఇన్‌ఫ్లమేషన్ బాధ నుంచి ఉపశమనం కోసం వేడి నీటి కాపడానికి బదులుగా క్యాబేజీ పట్టు వేస్తే ఫలితం కచ్చితంగా ఉంటుందని నిరూపించే...
పరిశోధన
ఇన్‌ఫ్లమేషన్ బాధ నుంచి ఉపశమనం కోసం వేడి నీటి కాపడానికి బదులుగా క్యాబేజీ పట్టు వేస్తే ఫలితం కచ్చితంగా ఉంటుందని నిరూపించే ఒక తాజా పరిశోధన వెలుగులోకొచ్చింది. మరిన్ని వివరాలు...
సంప్రదాయ వైద్య విధానంలో భాగంగా ఇన్‌ఫ్లమేషన్‌తో కూడిన వాపు, నొప్పులను తగ్గించుకోవడం కోసం పలు ప్రాంతాల్లో క్యాబేజీ ఆకులతో పట్టు వేస్తూ ఉంటారు. అయితే ఈ రకమైన కట్టుతో నిజంగానే ఫలితం ఉంటుందనీ, ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. క్యాబేజీలో ఎమ్‌ఐఆర్‌ఐ72, ఎమ్‌ఐఆర్‌ఐ72బి అనే మైక్రో ఆర్‌ఎన్‌ఎ పరమాణువులుంటాయి. ఈ వృక్ష సమ్మేళనాలు శరీరంలోని ఇన్‌ఫ్లమేటరీ పాత్‌వేలోని ఫ్యాన్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని, కీళ్ల నొప్పి, వాపులకు దారితీసే భౌతిక సంకేతాలను అణచివేస్తాయి. ఆస్టియో ఆర్థ్రయిటిస్ రోగుల్లో కీళ్ల నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు డిక్లొఫినాక్ జెల్‌తో సమానమైన ప్రభావాన్ని కనబరుస్తున్నట్టు, పలు ప్రయోగాల్లో రుజువైంది. యాంథోసయానిన్, గ్లుటమిన్, సల్ఫర్ మొదలైన యాంటి ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉండే క్యాబేజీ ఆకులు... దెబ్బలు, గాయాలు, మాస్టైటి్‌సల నుంచి అదనపు ద్రవాన్ని సంగ్రహించి, వాటిని మాన్పుతాయని కూడా పరీక్షల్లో రుజువైంది.
ఇవి కూడా చదవండి..
'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం