Share News

కళ్లు మండుతున్నాయా..?

ABN , Publish Date - May 02 , 2026 | 01:32 AM

ఎండ, పొడిగాలి, వాతావరణ కాలుష్యం, ఏసీ రూమ్‌లో ఎక్కువసేపు గడపడం లాంటి కారణాల వల్ల కళ్లలో తేమ తగ్గుతుంది. దీంతో కళ్లు పొడిబారి మండుతుంటాయి. అలాంటప్పుడు...

కళ్లు మండుతున్నాయా..?

ఎండ, పొడిగాలి, వాతావరణ కాలుష్యం, ఏసీ రూమ్‌లో ఎక్కువసేపు గడపడం లాంటి కారణాల వల్ల కళ్లలో తేమ తగ్గుతుంది. దీంతో కళ్లు పొడిబారి మండుతుంటాయి. అలాంటప్పుడు కళ్లకు ఉపశమనం కలిగించే చిట్కాలివే...

  • వాడేసిన టీ బ్యాగ్‌లను కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి ఆపైన కళ్లపై పెట్టుకుని అరగంటసేపు విశ్రాంతి తీసుకుంటే కళ్ల మంట తగ్గుతుంది. కంటి నరాల్లో ఒత్తిడి మాయమవుతుంది. ఎరుపుదనం తగ్గి కళ్లు ప్రకాశవంతంగా మారతాయి.

  • బంగాళదుంప, కీరాలను చక్రాలుగా తరిగి కళ్లపై ఉంచుకుంటే కళ్లకు చల్లదనం చేకూరుతుంది.

  • కలబంద గుజ్జును ఒకసారి చల్లటి నీళ్లతో కడిగి కళ్ల చుట్టూ ప్యాక్‌లా అప్లయ్‌ చేసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. పావుగంటలో కళ్ల మంట, దురద తగ్గుతాయి.

  • ఎండాకాలంలో రోజుకు రెండు లేదా మూడుసార్లు కళ్లను చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల కళ్లకు రక్తప్రసరణ జరిగి మంట తగ్గుతుంది.

  • తరచూ మంచి నీళ్లు తాగుతూ ఉంటే కావాల్సినంత తేమ అంది కళ్లు పొడిబారకుండా ఉంటాయి.

  • బయటికి వెళ్లేటప్పుడు సన్‌ గ్లాసెస్‌ ధరిస్తే సూర్యరశ్మి నుంచి కళ్లకు రక్షణ లభిస్తుంది. కంటి సమస్యలు రావు.

  • రోజూ కనీసం ఎనిమిది గంటలు హాయిగా నిద్రిస్తే కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా కళ్లలో దురద, మంట, గరగరలాడడం లాంటి సమస్యలు రావు.

  • రాత్రిపూట పడకగదిలో హ్యుమిడిఫైయర్‌ను ఉపయోగించడం మంచిది. ఫ్యాన్‌, కూలర్‌, ఏసీల నుంచి వచ్చే గాలి లేదా చల్లదనం నేరుగా ముఖానికి తగలకుండా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 01:32 AM