బడ్జెట్‌లో ఇంటీరియర్!
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:58 AM
అందమైన ఇంటిని నిర్మించడానికే కాదు దాని ఇంటీరియర్ డెకరేషన్‌కు కూడా లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సరైన ప్రణాళికతోపాటు మెటీరియల్ ఎంపికలో...
అందమైన ఇంటిని నిర్మించడానికే కాదు దాని ఇంటీరియర్ డెకరేషన్‌కు కూడా లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సరైన ప్రణాళికతోపాటు మెటీరియల్ ఎంపికలో కూడా తెలివిగా వ్యవహరిస్తే బడ్జెట్‌లోనే ఇంటిని ప్యాలెస్‌లా మార్చుకోవచ్చు.
ఖరీదైన ఫర్నిచర్ కోసం చూడకుండా మల్టీ ఫంక్షనల్ ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసుకుంటే హాల్ విశాలంగా కనిపిస్తుంది. గోడలన్నింటికీ టెక్స్చర్ పెయింట్ వేయించడానికి బదులు ఒక గోడకు మాత్రమే యాక్సెంట్ కలర్ ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. పీవీసీ ఫ్లూటెడ్ ప్యానెల్స్‌ను డిజైన్ చేసుకున్నా ఖర్చు చాలావరకు తగ్గిపోతుంది.
ఫాల్స్ సీలింగ్ కోసం లక్షలు ఖర్చు చేసే బదులు కోవ్ లైటింగ్ లేదా ఎల్‌ఈడీ స్ట్రిప్స్‌తో ఇంటికి గ్రాండ్ లుక్ తీసుకురావచ్చు.
మాడ్యులర్ కిచెన్ కోసం చూడకుండా అవసరానికి తగ్గట్టు సౌకర్యవంతంగా ఉండేలా వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి. ప్లైవుడ్‌కు బదులు డబ్ల్యూపీసీ బోర్డులను వాడుకుంటూ క్యాబినెట్లకు తలుపులు లేకుండా ఓపెన్ షెల్వింగ్ పద్ధతిని అనుసరిస్తే ఖర్చు చాలావరకు తగ్గుతుంది. అంతేకాదు వంటగది వెలుతురుతో నిండి పెద్దగా కనిపిస్తుంది.
పడక గదిలో స్టోరేజ్ సౌకర్యం ఉన్న బెడ్స్ ఎంచుకుంటే అదనపు అల్మారాలు అవసరం ఉండవు. అల్యూమినియం సెక్షన్లతో నిండిన వార్డ్‌రోబ్స్, స్లైడింగ్ డోర్ కబోర్డులు స్థలాన్ని ఆదా చేస్తాయి. లేటెస్ట్ మ్యాట్ ఫినిషింగ్‌తో ఉన్న ల్యామినేట్ షీట్లు ఎంచుకుంటే బడ్జెట్‌లోనే లగ్జరీ లుక్ తెచ్చుకోవచ్చు.
బాత్రూమ్ గోడలకు కింది నుంచి ఏడడుగుల ఎత్తు వరకు మాత్రమే టైల్స్ వేయించి పై భాగంలో చక్కని పెయింటింగ్ ఎంపిక చేసి ఖర్చు తగ్గించవచ్చు. బ్రాండెడ్ ఫిట్టింగ్స్‌లో టాప్ మోడల్స్ కాకుండా ఎంట్రీ లెవెల్ సిరీస్‌లను తెచ్చుకుంటే క్వాలిటీతోపాటు వారెంటీ కూడా లభిస్తుంది.
కారిడార్లలో రెయిలింగ్ కోసం అద్దాలు వాడితే బిల్డింగ్ కాస్ట్లీగా కనిపిస్తుంది.
ఇంటి నిర్మాణ సమయంలోనే ఇంటీరియర్ డిజైనింగ్‌ను దృష్టిలో పెట్టుకుంటూ వైరింగ్, ప్లంబింగ్ పాయింట్లను నిర్ణయించుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి