Share News

బోర్‌ కొట్టేలా చూసుకోవాలి

ABN , Publish Date - Aug 18 , 2026 | 04:53 AM

ఒక్క క్షణం తీరిక దొరికినా ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్నారా? అయితే మీ మెదడు నిరంతర ప్రేరణకు అలవాటు పడిందని అర్థం. దీన్నే ‘బ్రెయిన్‌ రాట్‌’ అని అంటారు. ఈ పరిస్థితి నుంచి వీలైనంత త్వరగా...

బోర్‌ కొట్టేలా చూసుకోవాలి

ఇదీ విషయం

ఒక్క క్షణం తీరిక దొరికినా ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్నారా? అయితే మీ మెదడు నిరంతర ప్రేరణకు అలవాటు పడిందని అర్థం. దీన్నే ‘బ్రెయిన్‌ రాట్‌’ అని అంటారు. ఈ పరిస్థితి నుంచి వీలైనంత త్వరగా బయటపడేలా చూసుకోవాలి.

ప్రతి కొన్ని సెకన్లకూ మన మెదడు నిరంతర ప్రేరణకు అలవాటు పడిందా లేదా అన్నది ఎవరికి వారు గమనించుకోవాలి. అందుకోసం ఈ కింది లక్షణాలను పరిశీలించాలి.

  • ఫోన్‌ను పరీక్షించకుండా ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోవడం. పని చేయడానికో, చదవడానికో పూనుకున్న కొన్ని నిమిషాలకే ఫోన్‌ను చెక్‌ చేయాలనే బలమైన కోరిక కలగడం....

  • ఫోన్‌ను చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారో గుర్తు రాకపోవడం. ఒక పని కోసం ఫోన్‌ చేతుల్లోకి తీసుకుని, కొన్ని రీల్స్‌ చూసిన తర్వాత అసలు ఫోన్‌ చేతుల్లోకి తీసుకున్న కారణాన్నే మర్చిపోవడం...

  • ఫోన్‌ జోలికి వెళ్లకుండా, పుస్తకంలో కొన్ని పేజీలు కూడా చదవలేకపోవడం. మునుపటిలా సుదీర్ఘ సమాచారం పట్ల ఆసక్తి లోపించడం....

  • సాధారణ సంభాషణల్లో చురుగ్గా పాల్గొనలేకపోవడం... వీటన్నిటి అసలు సమస్య ఫోన్‌లో లేదు. దాన్నుంచి మనం పొందే నిరంతర ప్రేరణలో ఉంది. కాబట్టి ఫోన్‌ వాడకాన్ని వీలైనంత తక్కువ సమయానికి పరిమితం చేసి, బాహ్య అంశాల నుంచి ప్రేరణ పొందే ప్రయత్నం మొదలుపెట్టాలి. మొదట్లో బోర్‌ కొట్టినట్టు అనిపించవచ్చు. కానీ బోర్‌ కొట్టే అవకాశం కల్పించినప్పుడే, మనకున్న ఫోన్‌ వ్యసనాన్ని కనిపెట్టి, దాన్నుంచి బయటపడే మార్గాలను వెతుక్కో గలుగుతాం!

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 04:53 AM