ఈ ఇంప్లాంట్‌తో డిప్రెషన్ దూరం
ABN , Publish Date - May 26 , 2026 | 03:24 AM
మందులతో లొంగని మొండి డిప్రెషన్ చికిత్స కోసం, ఒక బ్రెయిన్ ఇంప్లాంట్ మానవ ప్రయోగాలకు అనుమతి పొందింది. మరిన్ని విశేషాలు....
వైద్య పురోగతి
మందులతో లొంగని మొండి డిప్రెషన్ చికిత్స కోసం, ఒక బ్రెయిన్ ఇంప్లాంట్ మానవ ప్రయోగాలకు అనుమతి పొందింది. మరిన్ని విశేషాలు....
సంప్రదాయ వైద్య విధానంతో అదుపులోకి రాని కుంగుబాటుతో బాధపడే రోగులకు ఊరటను అందించే దిశగా రూపొందిన, బ్లూబెర్రీ పరిమాణంలోని ఈ మెదడు ఇంప్లాంట్‌ను అమర్చడానికి, ఇన్వేసివ్ సర్జరీని ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. మెదడు కణజాలానికి తగిలే వీలు లేకుండా, పుర్రె ఎముక మధ్యలో ఇమిడిపోయేలా మోటిఫ్ న్యూరోటెక్, ఈ డాట్ పరికరాన్ని రూపొందించింది. భావోద్వేగాల నియంత్రణతో సంబంధం కలిగిన బ్రెయిన్ సర్క్యూట్స్ లక్ష్యంగా ఎలక్ట్రికల్ పల్సె్‌సను విడుదల చేసే ఈ ఇంప్లాంట్‌ను, బాహ్య పరికరం ద్వారా నియంత్రించే వీలుంటుంది. కాబట్టి వైద్యులు, ఎలాంటి సర్జరీతో పని లేకుండా రోగికి అందించవలసిన చికిత్స మోతాదులను సర్దుబాటు చేయగలుగుతారు. ప్రస్తుతం వైద్యులు, ఈ పరికరం సామర్థ్యం, ప్రభావాలు, లక్షణాలను 12 నెలల పాటు విశ్లేషించబోతున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, డిప్రెషన్ రోగులకు గొప్ప ఊరట లభిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..