రెంటికీ తేడాలు ఇవే...
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:46 AM
చూడగానే ఒకేలా కనిపించే నల్ల నువ్వులు, కలోంజి సీడ్స్... రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాలు పూర్తిగా భిన్నం. వీటిని తేలిగ్గా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...
చూడగానే ఒకేలా కనిపించే నల్ల నువ్వులు, కలోంజి సీడ్స్... రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాలు పూర్తిగా భిన్నం. వీటిని తేలిగ్గా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...
కలోంజి సీడ్స్
ఇవి చిన్న త్రిభుజాకారంలో గరుకుగా ఉంటాయి. వీటికి ఘాటైన వాసన ఉంటుంది. మిరియాలు, ఉల్లిపాయలు కలిసిన రుచితో ఉంటాయి. వీటిని ఉల్లి గింజలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి పలు విటమిన్లు, ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో నిండి ఉంటాయి. గ్లాసు నీటిలో అరచెంచా కలోంజి సీడ్స్ వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే బరువు తగ్గుతారు. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి కూడా. తాలింపు పెట్టేటప్పుడు నూనెలో చిటికెడు కలోంజి గింజలు వేస్తే పప్పు, కూరలు, పచ్చళ్ల రుచి పెరుగుతుంది. సమోసా, కచోరి, పరాటా లాంటి స్టఫ్‌డ్ వంటకాల్లో వీటిని వాడవచ్చు. ఊరగాయలు తదితర నిల్వ పచ్చళ్లలో కూడా వీటిని వేసుకోవచ్చు.
నల్ల నువ్వులు
ఇవి నున్నగా చదునుగా ఉంటాయి. నోట్లో వేసుకుని నమిలితే నూనె రుచి తెలుస్తుంది. వీటిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. శీతాకాలంలో వీటిని ఆహారంలో చేర్చుకుంటే శరీర ఉష్ణోగ్రత తటస్థంగా ఉంటుంది. ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. తరచూ నల్ల నువ్వులతో తయారుచేసిన లడ్డూలు, కజ్జికాయలు లాంటివి తినడం మంచిది. వీటిని దోరగా వేయించి వెజిటబుల్ సలాడ్స్‌పై చల్లుకోవచ్చు. మఫిన్స్, కుకీలు, బిస్కెట్స్‌ను బేక్ చేసేముందు వాటిపై నల్ల నువ్వులతో గార్నిష్ చేయవచ్చు. నాన్, కుల్చాల తయారీలో కూడా వీటిని వాడవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..