నల్ల డబ్బాలతో చేటే!
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:57 AM
ఫుడ్ ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే నలుపు రంగు ప్లాస్టిక్, అత్యంత విషపూరితమైన ప్లాస్టిక్‌గా గుర్తింపు పొందింది. ఈ రంగు ప్లాస్టిక్ వస్తువులన్నీ పాత...
మీకు తెలుసా?
ఫుడ్ ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే నలుపు రంగు ప్లాస్టిక్, అత్యంత విషపూరితమైన ప్లాస్టిక్‌గా గుర్తింపు పొందింది. ఈ రంగు ప్లాస్టిక్ వస్తువులన్నీ పాత ఎలకా్ట్రనిక్ వస్తువులు, కార్ల విడిభాగాలు, మిశ్రమ ప్లాస్టిక్స్‌తో తయారవుతాయి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు, వాటిలోని ఆహార పదార్థాల్లోకి ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఆ రసాయనాలు ఏవంటే...
బిపిఎ:
బిస్ఫినాల్ ఎ రసాయనం హార్మోన్లను అస్తవ్యస్థం చేస్తుంది. క్యాన్సర్ ముప్పును పెంచుతుంది
థాలేట్స్:
పునరుత్పత్తి సమస్యలను పెంచుతాయి. పిల్లల్లో ఎదుగుదల లోపాలను పెంచుతాయి
సీసం, క్యాడ్మియం:
ఈ విషపూరితమైన లోహాలు నాడీ నష్టాన్ని కలిగిస్తాయి
వీటికి బహిర్గతమవడం వల్ల...
క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది
పునరుత్పత్తి సమస్యలు పెరుగుతాయి
నాడీ సమస్యలు పెరుగుతాయి
హార్మోన్ల అసమతౌల్యం పెరుగుతుంది
ప్రత్యామ్నాయాలు
ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు పదార్థాల ప్యాకేజింగ్‌కు ఈ నల్ల డబ్బాలను వాడుతూ ఉంటాయి. కాబట్టి పార్సిల్ చేయించుకునే సమయంలో గాజు లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ డబ్బాలను వెంటతీసుకువెళ్లాలి. లేదంటే కాగితం ఆధారిత ప్యాకేజింగ్ ఎంచుకోవాలి. ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే వస్తువుల గురించి రెస్టారెంట్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు