Share News

బ్లాక్‌ కాఫీ బాగు బాగు

ABN , Publish Date - May 12 , 2026 | 04:17 AM

బ్లాక్‌ కాఫీకి అలవాటు పడితే, చక్కెర కలిపిన ఏ కాఫీ తాగలేం! నిజానికి ఇదెంతో మంచి అలవాటు. బ్లాక్‌ కాఫీతో ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే...

బ్లాక్‌ కాఫీ బాగు బాగు

ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీకి అలవాటు పడితే, చక్కెర కలిపిన ఏ కాఫీ తాగలేం! నిజానికి ఇదెంతో మంచి అలవాటు. బ్లాక్‌ కాఫీతో ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే...

రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల బ్లాక్‌ కాఫీతో చక్కని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బ్లాక్‌ కాఫీలో....

క్లోరోజెనిక్‌ యాసిడ్స్‌: ఇది పాలీఫెనాల్‌ రారాజు. యాంటీ డయాబెటిక్‌, యాంటి ఇన్‌ఫ్లమేటరీ అయిన ఈ ఆమ్లం, కాలేయానికి రక్షణ కల్పిస్తుంది

కెఫీన్‌: నాడులకు రక్షణ కల్పించే కెఫీన్‌ మెటబాలిక్‌ బూస్టర్‌ కూడా!

డైటర్‌పీన్స్‌: ఇవి క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. కాలేయాన్ని కాపాడతాయి

మెలనోయిడిన్స్‌: ప్రిబయాటిక్‌, యాంటీఆక్సిడెంట్‌

ట్రైగోనెలిన్‌: విటమిన్‌ బి3గా మారుతుంది

ఎలా తాగాలంటే...

  • పాలు కలపకూడదు. పాలలోని ప్రొటీన్లు, క్లోరోజెనిక్‌ యాసిడ్స్‌తో కలిసిపోయి, శోషణను అడ్డుకుంటాయి

  • ఫ్రెంచ్‌ప్రెస్‌ లేదా దక్షిణభారతదేశ ఫిల్టర్‌ (డికాక్షన్‌), ఎస్‌ప్రెసో, పేపర్‌ ఫిల్టర్‌ డ్రిప్‌, ఇన్‌స్టంట్‌ కాఫీ తాగాలి

  • ఇన్‌స్టంట్‌ కాఫీలో రెండు నుంచి మూడు రెట్ల అక్రిలమైడ్‌ ఉంటుంది కాబట్టి తయారీ ప్రక్రియలో క్లోరోజెనిక్‌ యాసిడ్స్‌ నష్టమవుతాయి. కాబట్టి దీనికి బదులు మిగతా మార్గాలు అనుసరించడం ఉత్తమం

  • లైట్‌ లేదా మీడియం రోస్ట్‌ కాఫీ విత్తనాలు కొని, మరిగించడానికి ముందు విత్తనాలను దంచి, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు బ్లాక్‌ కాఫీ తాగాలి

  • ఉదయం 7 - 9 గంటల మధ్య ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గంట నుంచి గంటన్నర తర్వాత బ్లాక్‌ కాఫీ తీసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 12 , 2026 | 04:17 AM