కుండీలో తమలపాకు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:40 AM
తమలపాకు తీగ ఏపుగా గుబురుగా పెరగాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
తమలపాకు తీగ ఏపుగా గుబురుగా పెరగాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
నర్సరీ నుంచి తమలపాకు మొక్కను తెచ్చిన వెంటనే కుండీలోకి మార్చకూడదు. కనీసం అయిదు రోజులు అలాగే ఉంచి ఇంటి వాతావరణానికి అలవాటు పడనివ్వాలి. రెండు లేదా మూడు కణుపులు మట్టిలో ఉండేలా నాటితే అక్కడి నుంచి కొత్త వేర్లు వస్తాయి.
ఈ మొక్కకు ఎండ అవసరమే కానీ మండుటెండ తగిలితే ఆకులు వాడిపోతాయి. ఉదయం పూట వచ్చే లేత నీరెండ దీనికి సరిపోతుంది. గ్రీన్ నెట్ లేదా ఇతర చెట్ల నీడ పడేలా ఏర్పాటు చేసుకుంటే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.
తేమ వాతావరణంలో తమలపాకు మొక్క బాగా పెరుగుతుంది.
దీని వేర్లు చాలా సున్నితం. కుండీలో నీరు నిల్వ ఉంటే గంటల వ్యవధిలోనే వేర్లు కుళ్లిపోతాయి. కాబట్టి కుండీ అడుగున పెద్ద రంధ్రాలు చేయాలి.
మట్టిలో కొద్దిగా వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు, తగు మాత్రంలో ఇసుక, మోతాదు ప్రకారం కోకోపీట్, కాస్త వేప పిండి వేసి బాగా కలిపి కుండీలో వదులుగా నింపి మొక్కను నాటాలి. దీనివల్ల వేర్లకు గాలి అంది మొక్క వేగంగా విస్తరిస్తుంది. కుండీ మధ్యలో కర్ర లేదా చెక్క ఏర్పాటు చేస్తే తీగ పైకి పాకుతుంది.
ఎండిన కొమ్మలను, పసుపు రంగులోకి మారిన ఆకులను తొలగించాలి. అప్పుడే త్వరత్వరగా కొత్త చిగుర్లు వస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా