Share News

వీటితో దాహార్తి మాయం

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:01 AM

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం చెమట రూపంలో నీటిని కోల్పోయి త్వరగా అలసిపోతుంది. అలాంటప్పుడు దాహార్తిని తీర్చి...

వీటితో దాహార్తి మాయం

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం చెమట రూపంలో నీటిని కోల్పోయి త్వరగా అలసిపోతుంది. అలాంటప్పుడు దాహార్తిని తీర్చి శరీరానికి చల్లదనాన్ని అందించే పండ్లు ఇవే.

  • పుచ్చకాయలో నీటిశాతం అధికంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో తాజా పుచ్చకాయ ముక్కలు తింటే దాహం తీరడంతోపాటు శరీరానికి తక్షణశక్తి లభిస్తుంది.

  • తరచూ కర్బూజా పండును తినడం వల్ల శరీరం తేమను కోల్పోకుండా ఉంటుంది. వడదెబ్బ తగలదు.

  • కీర ముక్కలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. నోరు తడారిపోవడం, గొంతెండిపోవడం లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది.

  • కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్‌, నీరసం, అలసట తగ్గి తాజా అనుభూతి కలుగుతుంది.

  • నారింజ, బత్తాయి, దానిమ్మ, చెర్రీ, స్ట్రాబెర్రీ, అనాస, మల్బరీ, వాటర్‌ యాపిల్‌, ద్రాక్ష లాంటి పండ్లు తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాదు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తాటి ముంజలు, నిమ్మరసం, చెరకురసం కూడా మేలు చేస్తాయి. మామిడి పండ్లను మితంగా తినడం మంచిది.

  • బొప్పాయి, లిచీ, నేరేడు పండ్లు కూడా వేసవిలో మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:01 AM