వేసవిలో ఉపశమనానికి
ABN , Publish Date - Apr 29 , 2026 | 02:39 AM
వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం...
వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం...
కొబ్బరి నీళ్లలో ఎలకో్ట్రలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. తరచూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో తేమ నిలిచి ఉంటుంది.
వేసవిలో పలుచని మజ్జిగ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. మజ్జిగలో కొద్దిగా నల్ల ఉప్పు, పుదీనా తరుగు, జీలకర్ర పొడి, శొంఠి లాంటివి కలుపుకుని తాగితే దాహార్తి తగ్గుతుంది.
మామిడి గుజ్జు, బెల్లం, మసాలా పొడులు కలిపి తయారుచేసే ఆమ్ పన్నా షర్బత్ తాగడం వల్ల తాజా అనుభూతి కల్గుతుంది. వేసవి తాపం తగ్గుతుంది.
పుచ్చకాయ, కర్బూజా, కీర దోసల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. సలాడ్స్, అల్పాహారం లేదా భోజనంలో వీటిని చేర్చుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. వీటితో తయారుచేసే జ్యూస్‌లు తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉల్లిపాయ ముక్కలు శరీరానికి చలువదనాన్ని అందిస్తాయి. పచ్చి పులుసు, మజ్జిగ, అంబలి, సలాడ్స్ లాంటి వాటిలో ఉల్లిపాయ ముక్కలు చేర్చుకుని తీసుకుంటే వేసవిలో ప్రయోజనకరంగా ఉంటుంది.
అల్లం ముక్కలు, మిరియాలు, పుదీనా తరుగు చేర్చి తయారుచేసిన పెరుగన్నం తింటే కడుపులో చల్లని అనుభూతి కలుగుతుంది. శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ అందుతాయి.
చల్లటి నీళ్లలో బెల్లం, మిరియాలు, శొంఠి, నిమ్మరసం కలిపి పానకం తయారుచేసుకుని తాగితే ఎండ వల్ల కలిగే అలసట తీరుతుంది. వడదెబ్బ తగలదు.
ఇవి కూడా చదవండి..
రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా
పోలింగ్ వేళ బాంబుదాడులు జరక్కుండా రంగంలోకి ఎన్ఐఏ