ఇంటికి రంగులు వేస్తున్నారా..?
ABN , Publish Date - Jun 15 , 2026 | 01:42 AM
ఇంటికి రంగులు వేసేటప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం...
ఇంటికి రంగులు వేసేటప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం...
ఇంటికి ఏ రంగులు వేయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. రంగులను ఎంపిక చేసేటప్పుడు స్థానిక వాతావరణాన్ని పరిశీలించాలి. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాలయితే నీలం లేదా ఆకుపచ్చ టౌప్ పెయింట్స్, ఎప్పుడూ చల్లగా ఉండేచోట ఎరుపు లేదా పసుపు టౌప్ రంగులు వేయించుకోవాలి.
హాల్, కిచెన్, స్టడీ రూమ్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్‌ల కోసం కాంతిని ప్రతిబింబించే రంగుల్ని ఎంపిక చేయాలి. తెలుపు, లేత నీలం, ఐవరీ, పీచ్ రంగులు... ఇంటిని ప్రకాశవంతంగా విశాలంగా కనిపించేలా చేస్తాయి.
అన్ని గదులకు ఒకే రంగు కాకుండా ఇల్లంతా కళాత్మకంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పడక గదిలో మనసుకు ప్రశాంతతనిచ్చే రంగులు, పిల్లల గదిలో ఆకర్షణీయమైన షేడ్స్‌ను వేయించడం ప్రయోజనకరం. పింక్ లేదా పర్పుల్ టౌప్ పెయింట్స్ ప్రయత్నించవచ్చు. అలాగే లావెండర్, లేత నీలం, పాస్టెల్ రంగులు కూడా అహ్లాదకరమైన అనుభూతినిస్తాయి.
ఇంటి వైశాల్యం, ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్ తదితరాలకు నప్పేలా రంగులను ఎంపిక చేసుకోవాలి.
ఇంటి సీలింగ్‌కు వైట్ పెయింట్ వేయించడం మంచిది. దీనివల్ల ఇల్లంతా సహజ కాంతితో ప్రకాశిస్తుంది.
వంటగదిలో ఎమల్షన్ పెయింట్స్ వేయిస్తే బాగుంటుంది. వీటికి నాణ్యత అధికం. ఇవి... పొగ, జిడ్డు, ఇతర మరకలను సులువుగా తొలగించడానికి అనువుగా ఉంటాయి.
స్నానాల గదిలో తెలుపు, లేత ఆకుపచ్చ, లేత బూడిద రంగులు వేయిస్తే తాజా అనుభూతి కలుగుతుంది.
బాల్కనీ, ఇంటి బయటి గోడలకు ఆఫ్ వైట్, డస్టీ సేజ్ గ్రీన్, బీజ్ షేడ్స్ బాగుంటాయి.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..
మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..