గుండె ఆరోగ్యానికి..
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:53 AM
శరీరం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలంటే తరచూ తాజా పండ్లు తింటూ ఉండాలి. ముఖ్యంగా గుండె సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏ పండ్లు తినాలో..
శరీరం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలంటే తరచూ తాజా పండ్లు తింటూ ఉండాలి. ముఖ్యంగా గుండె సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏ పండ్లు తినాలో తెలుసుకుందాం...
జామ, నారింజ, బత్తాయి పండ్లలో పీచు, సి విటమిన్, పొటాషియం, కార్బోహైడేట్లు అధికం. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. నారింజ పండును ఓట్‌మీల్‌తో కలిపి అల్పాహారంగా తీసుకోవడం మంచిది. భోజనానికి ముందు జామ పండును తినడం వల్ల రక్తంలోని లిపిడ్ ప్రొఫైల్స్ మెరుగుపడి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. మధ్యాహ్న సమయంలో ఒక గ్లాసు బత్తాయి రసంలో చిటికెడు నల్లఉప్పు కలుపుకుని తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.
యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే పీచు ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకోకుండా చేస్తుంది. దీనివల్ల కరోనరీ గుండె జబ్బులు రావు. శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ వేగాన్ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో రక్తనాళాలు, గుండె నరాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. రోజుకొక యాపిల్‌ను ఓట్‌మీల్ లేదా సలాడ్లలో చేర్చుకుని తినడం మంచిది.
దానిమ్మలో పాలిఫెనాల్స్, బొప్పాయిలో లైకోపిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ధమనులలో రక్త ప్రసరణకు తోడ్పడతాయి. అలాగే వాటిలోని టానిన్లు గుండె గోడలపై పేరుకునే కాల్షియాన్ని శుభ్రం చేస్తాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి గుండెను కాపాడతాయి.
ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్, ఆంథోసయనిన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను, రక్తంలోని మలినాలను శుభ్రం చేసి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. రోజూ ఒక కప్పు ద్రాక్ష పండ్లను స్నాక్‌లా తినడం మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా
For More AP News And Telugu News