Share News

వాన వేళ ఇవి తీసుకోవాలి...

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:24 AM

వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి తేలికగా జీర్ణమై రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవేంటంటే...

వాన వేళ ఇవి తీసుకోవాలి...

సీజనల్‌ కేర్‌

వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి తేలికగా జీర్ణమై రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవేంటంటే...

  • అల్లం, మిరియాలు, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు... జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి.

  • రాగులు, జొన్నలు, కొర్రలు, అరికెలు, సామలు లాంటి చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతౌల్యంలో ఉంటాయి.

  • వర్షాకాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది. కాబట్టి వేడి వేడిగా ఏదైనా సూప్‌ లేదా గ్రీన్‌ టీ తాగితే హాయిగా అనిపిస్తుంది. చిటికెడు పసుపు కలిపిన గోరువెచ్చటి పాలు తాగినా తక్షణ శక్తి లభిస్తుంది. మిరియాల రసం, టమాటా రసం, సాంబారు లాంటి వాటిని భోజనంలో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

  • తరచూ పప్పు ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. చల్లటి వాతావరణం వల్ల కలిగే నీరసం, బద్దకం తగ్గి ఉత్సాహంగా అనిపిస్తుంది.

  • జామ, దానిమ్మ, అరటి, యాపిల్‌, బొప్పాయి పండ్లను శుభ్రంగా కడిగి తింటూ ఉంటే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అంది శరీరం చురుకుగా మారుతుంది. రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది.

  • వాతావరణం చల్లగా ఉందంటూ బజ్జీలు, పకోడీలు తదితర నూనెలో వేగించే ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు. వీటివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపులో మంట లాంటి సమస్యలు ఎదురవుతాయి.

  • వర్షాల వల్ల ఆకు కూరల్లో క్రిమికీటకాలు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఉప్పు నీటిలో అయిదు నిమిషాలు నానబెట్టి ఆపైన వేడి నీటితో కడిగి వండడం ప్రయోజనకరం.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 04:24 AM