Share News

పొడవాటి శిరోజాల కోసం

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:40 AM

శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే సరైన ఆహారం తీసుకోవాలి...

పొడవాటి శిరోజాల కోసం

శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే సరైన ఆహారం తీసుకోవాలి...

  • రోజూ రెండు కోడిగుడ్లు తినాలి వీటిలోని ప్రోటీన్‌, బయోటిన్‌, జింక్‌, ఐరన్‌ తదితర పోషకాలు... మాడు మీద కుదుళ్లను బలోపేతం చేస్తాయి. దీంతో శిరోజాలు పొడవుగా పెరుగుతాయి.

  • ఎ, కె విటమిన్లతోపాటు ఫోలేట్‌, జింక్‌, మెగ్నీషియం, ఐరన్‌ అధికంగా లభించే పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే శిరోజాలు బాగా పెరుగుతాయి.

  • శిరోజాల సంరక్షణకు ఉసిరిని మించిందిలేదు. దానిలోని సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు శిరోజాలు నల్లగా, పొడవుగా పెరగడానికి తోడ్పడతాయి.

  • రోజుకు అయిదు బాదం పప్పులను నీటిలో నానబెట్టి తినడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. వాటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శిరోజాల పెరుగుదలకు దోహదం చేస్తాయి.

  • తరచూ సాల్మన్‌, ట్యూనా, మాకరెల్‌ లాంటి చేపలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, డి విటమిన్‌ కలిసి శిరోజాల సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.

  • రోజూ కప్పు పెరుగును తీసుకోవడం వల్ల బి5, డి విటమిన్లతోపాటు కాల్షియం, ప్రోటీన్‌ లాంటి పోషకాలు అంది శిరోజాలు బలంగా పొడవుగా పెరుగుతాయి.

  • యాంటీ ఆక్సిడెంట్లు, కె విటమిన్‌, కెరోటిన్‌ అధికంగా లభించే కేరట్లు; మెగ్నీషియం, ఇ విటమిన్‌, బయోటిన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభించే అవకాడో; సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలను తరచూ తినడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Updated Date - Jun 27 , 2026 | 01:40 AM