ఇవి తాగాలి
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:18 AM
శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మెరిసేందుకు ఏ పానీయాలు తాగాలో తెలుసుకుందాం...
శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మెరిసేందుకు ఏ పానీయాలు తాగాలో తెలుసుకుందాం...
చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో ఉసిరి రసం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి చర్మ కణాలను పెంచుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. దీంతో ముడుతలు, గీతలు, మచ్చలు తొలగిపోతాయి.
రాత్రి పడుకునేముందు గ్లాసు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఉదయానికల్లా అలసట తీరి ముఖం తాజాగా కనిపిస్తుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ధనియాలు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే వడబోసుకుని తాగితే రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో వేడి అదుపులో ఉంటుంది.
గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి రెండు చెంచాల సోంపు వేసి బాగా మరిగించి కొద్దిగా పటికబెల్లం కలుపుకుని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో శరీరంలోని వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఈ వార్తలనూ చదవండి: