వీటితో పేగులు బలంగా...
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:01 AM
శరీరంలో జీవక్రియలు సజావుగా జరగాలంటే పేగులు బలంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం ఉదయాన్నే ఎలాంటి అల్పాహారం తీసుకోవాలో తెలుసుకుందాం...
శరీరంలో జీవక్రియలు సజావుగా జరగాలంటే పేగులు బలంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం ఉదయాన్నే ఎలాంటి అల్పాహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
పులిసిన పిండితో తయారుచేసే ఇడ్లీ, దోశలాంటివాటిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. వీటిని గ్రీన్ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో కలిపి తింటే పేగుల్లో మలినాలు తొలగిపోతాయి.
రాత్రి పడుకునేముందు ఒక కప్పు ఓట్స్‌లో తగినంత పెరుగు, కొన్ని చియా సీడ్స్ లేదా అవిసె గింజలు వేసి బాగా కలిపి పెట్టి, ఉదయాన్నే తింటే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
తాజా పండ్లు లేదా కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌లో నానబెట్టిన బాదం పలుకులు, కొన్ని ఖర్జూరాలు కలుపుకుని తింటే పేగులు బలోపేతమవుతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే అవకాడో స్ర్పెడ్ లేదా టోస్ట్‌ను అల్పాహారంలో చేర్చుకోవడం మంచిది
రోజూ అరటి పండ్లు, యాపిల్ పండ్లు, బెర్రీలు తినాలి. తృణధాన్యాలతో చేసిన బ్రెడ్‌తోపాటు పీనట్ బటర్‌ను తీసుకుంటే పేగుల పనితీరు మెరుగుపడుతుంది. పెరుగులో కొంచెం తేనె కలుపుకుని తీసుకుంటే పేగులు ఆరోగ్యంగా పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్