Share News

కృత్రిమ తీపి వద్దు

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:18 AM

కృత్రిమ చక్కెరలు జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి క్షీణతను వేగవంతం చేయడంతో ముడిపడి ఉన్నాయి. ఈ పరిస్థితి 1.6 సంవత్సరాల మెదడు వృద్ధాప్యంతో సమానమని పరిశోధకులు పేర్కొంటున్నారు. మరిన్ని వివరాలు...

కృత్రిమ తీపి వద్దు

పరిశోధన

కృత్రిమ చక్కెరలు జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి క్షీణతను వేగవంతం చేయడంతో ముడిపడి ఉన్నాయి. ఈ పరిస్థితి 1.6 సంవత్సరాల మెదడు వృద్ధాప్యంతో సమానమని పరిశోధకులు పేర్కొంటున్నారు. మరిన్ని వివరాలు...

బ్రెజిల్‌ యూనివర్శిటీలోని సావో పాలో పరిశోధకులు, 12,772 మంది పెద్దల ఆహారపుటలవాట్లను దాదాపు ఎనిమిదేళ్ల పాటు గమనించారు. ఆ తర్వాత వాళ్ల జ్ఞాపకశక్తి, పదాలను గుర్తుచేసుకోగలిగే సామర్థ్యం, మాట్లాడే నైపుణ్యాలను పరిశీలించారు. రోజుకు 191 మిల్లీగ్రాముల చొప్పున కృత్రిమ తీపిని తిన్న వారిలో వారి ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి 62ు వేగంగా క్షీణిస్తున్నట్టు కనిపెట్టారు. వారి మెదడు కూడా 1.6 అదనపు సంవత్సరాల వృద్ధాప్యానికి చేరువ అయినట్టు కూడా ఈ పరిశోధనలో కనిపెట్టారు. ఆస్పర్టమ్‌, సకారిన్‌, ఏస్‌సల్ఫేమ్‌-కె, ఎరిథ్రిటాల్‌, క్సైలిటాల్‌, సార్బిటాల్‌ అనే ఈ ఆరు కృత్రిమ చక్కెరలూ మెదడు మీద గణనీయమైన ప్రభావాన్ని కనబరుస్తాయని ఈ పరిశోధనలో వెల్లడైండి. కాబట్టి చక్కెర చేటు నుంచి తప్పించుకోవడం కోసం కృత్రిమ చక్కెరలను ఆశ్రయించేవారు అప్రమత్తంగా నడుచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 02:18 AM