అర్షదీప్‌ప్రియసఖి!
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:03 AM
సమ్రీన్ కౌర్... చిత్రసీమలో కన్నా క్రికెట్ మైదానాల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది ఈ నటి పేరు. కారణం... ఆమె భారత బౌలర్ అర్షదీ్‌పసింగ్ ఇష్ట సఖి అని జరుగుతున్న ప్రచారం. దీన్ని అధికారికంగా...
ట్రెండింగ్
సమ్రీన్ కౌర్... చిత్రసీమలో కన్నా క్రికెట్ మైదానాల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది ఈ నటి పేరు. కారణం... ఆమె భారత బౌలర్ అర్షదీ్‌పసింగ్ ఇష్ట సఖి అని జరుగుతున్న ప్రచారం. దీన్ని అధికారికంగా ఈ ఇద్దరూ ధ్రువీకరించకపోయినా... తరచూ కలిసి కెమెరాల కంట పడటం ఇందుకు ఊతం ఇస్తోంది. ఇంతకీ వీరి పరిచయం ఎక్కడ? మనసులు కలిసింది ఎప్పుడు? అర్షదీప్ ఆటను ప్రత్యక్షంగా ఆస్వాదిస్తూ... అభిమానులను ఆకర్షిస్తున్న 26 ఏళ్ల సమ్రీన్ స్టోరీ ఇది...
కోట్ల మంది ఆరాధించే క్రికెట్ మైదానంలో... అదీ ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్ మధ్యలో భారత ఎడమచేతి వాటం బౌలర్ అర్షదీ్‌పసింగ్ స్నాప్‌చాట్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ఒక అమ్మాయి చేతులు పట్టుకొని ఉన్న ఫొటో అది. సమయం, సందర్భం ఏమీ చెప్పకుండా ఆ చిత్రం వదిలాడు. అప్పటినుంచీ సామాజిక మాధ్యమాలు, అభిమానులు దాని అంతరార్థం ఏమిటనేది శోధించడం మొదలుపెట్టారు. డిటెక్టివ్‌ల్లా మారి... ఆ ఫొటోలను జూమ్ చేసి... ఆమె చేతిపైనున్న పచ్చబొట్టును, నెయిల్ డిజైన్‌ను పోల్చి చూశారు. అది నటి, మోడల్ సమ్రీన్‌కౌర్‌దేనని తేల్చారు. అదేసమయంలో ఐపీఎల్‌లో అర్షదీప్ ఆడిన మ్యాచ్‌లను స్టాండ్స్‌లో నుంచి వీక్షిస్తూ... అతడిని ఉత్సాహపరుస్తూ కనిపించింది సమ్రీన్. ఆ తరువాత ఒకటి రెండు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించడం ఊహలకు మరింత బలం చేకూర్చింది. ఇంతకీ ఎవరీ సమ్రీన్..!
అవకాశం వచ్చినా...
జమ్ముకశ్మీర్‌లో పుట్టిన సమ్రీన్‌ది ఉన్నత కుటుంబం. ఆమె తల్లి ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్. తండ్రి వ్యాపారవేత్త. చిన్నప్పటి నుంచీ సమ్రీన్ కూడా చదువుపై శ్రద్ధ పెట్టింది. పై చదువుల కోసం పుణే వెళ్లింది. అక్కడి ‘సింబియోసిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్’లో బీకాం ఆనర్స్ చదివింది. పన్నెండో తరగతిలో ఉండగానే సమ్రీన్‌కు సినిమాల్లో అవకాశం వచ్చింది. చిన్న వయసు కావడం, చదువు దెబ్బతింటుందన్న కారణంతో ఆమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు. అయితే సమ్రీన్‌కు గ్లామర్ ప్రపంచంపై మక్కువ ఎక్కువ. తండ్రి మాటకు విలువనిచ్చి చదువు కొనసాగించిన ఆమె, డిగ్రీ తరువాత తన అభిరుచికి పట్టం కట్టింది. మోడలింగ్‌తో కెరీర్‌ను మొదలుపెట్టిన ఆమెకు 2018లో మంచి బ్రేక్ లభించింది. జమ్ముకశ్మీర్ నుంచి ‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొనడంతో ఆమె పేరు దేశమంతటికీ పరిచయమైంది.
చిత్ర పరిశ్రమలోకి...
‘మిస్ ఇండియా’ పోటీలు తెచ్చిన గుర్తింపుతో సమ్రీన్‌కు పంజాబీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్‌లో అవకాశాలు వచ్చాయి. బాద్‌షా, గురు రంధవా, జస్ మనక్ తదితర ప్రముఖ గాయకులతో కలిసి చాలా ఆల్బమ్స్‌లో కనిపించింది. ఇది ఆమె కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. చదువుకునే రోజుల్లో వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకున్న సమ్రీన్‌కు మరోసారి పరిశ్రమ నుంచి ఆహ్వానం అందింది. పంజాబీ చిత్రం ‘సర్దార్‌జీ-2’లో అవకాశం లభించడంతో వెండితెర మీద తొలిసారి మెరిసింది. 2016లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సమ్రీన్. 2021లో రణవీర్‌సింగ్ హీరోగా క్రీడా నేపథ్యంలో కబీర్ ఖాన్ తెరకెక్కించిన ‘83’లో ప్రధాన పాత్ర పోషించింది. అదే ఏడాది అర్జున్ రామ్‌పాల్‌తో కలిసి ‘నెయిల్ పాలి్‌ష’లో నటించిన ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అభిమానులు తక్కువేం లేరు. దాదాపు అరకోటి మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

ఊహాగానాలు నిజమనేలా...
ఇటీవల ముగిసిన ఐపీఎల్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ జట్టు ఎడమచేతి వాటం ఫేస్ బౌలర్ అర్షదీ్‌పసింగ్, సమ్రీన్‌ల ప్రేమాయణం గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. పంజాబ్ కింగ్ జట్టు ముంబయిలో పర్యటించిన సందర్భంగా గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద అర్షదీప్ ఫొటోలు తీసుకుని, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల వ్యవధిలోనే అదే ప్రదేశం నుంచి సమ్రీన్ తన ఫొటోను తన సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఇదొక్కటే కాదు... ఆ తరువాత గురుద్వారా సందర్శనతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దిగిన ఫొటోలు కూడా ఇదే తరహాలో ఇన్‌స్టాలో దర్శనమిచ్చాయి. ఒకే ప్రదేశం నుంచి తొలుత అర్షదీప్, కాసేపటికి సమ్రీన్ ఇన్‌స్టాలో పంచుకున్నారు. వీటికితోడు వారిద్దరూ కలిసి నడుచుకొంటూ వెళ్లిన ఒక వీడియో నెట్టింట చెక్కర్లు కొట్టడంతో ఊహాగానాలు నిజమనే భావన కలిగిస్తున్నాయంటారు అభిమానులు.
స్టాండ్స్‌లోనూ సంబరాలు...
ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి, 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు అర్షదీప్. ఆ సందర్భంలో సమ్రీన్ స్టాండ్స్‌లో ఉత్సాహపరుస్తూ కనిపించింది. అద్భుతమైన యార్కర్‌తో అర్షదీప్ బ్యాట్స్‌మన్‌ను క్లీన్ బౌల్డ్ చేసినప్పుడు... ఆనందంతో కేరింతలు కొట్టింది. అదేసమయంలో మైదానంలో అతడు చిరునవ్వులు చిందించాడు. ఆ తరువాత ఈ వీడియో లక్షలకొద్దీ వ్యూస్‌తో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. అయితే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి వీరిద్దరూ ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం తన దృష్టంతా ఆటపైనేనని అర్షదీప్ ఓ సందర్భంలో చెప్పాడు. కానీ స్నాప్‌చాట్ స్టోరీ, గురుద్వారా దర్శనం, ఒకే ప్రాంతం నుంచి పెట్టిన ఫొటోలు, స్టాండ్స్‌లో ఆమె కేరింతలకు అతడి చిరునవ్వు చూస్తుంటే యాదృచ్చికంలా అనిపించడంలేదనేది అభిమానుల మాట.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్