నాటు, నీటు.. గుడ్లలో ఏవి మేలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:23 AM
ఫారం గుడ్లతో పోలిస్తే, నాటు గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం. వీటిలో ఏది మేలు? తెలుసుకుందాం!...
తెలుసుకుందాం
ఫారం గుడ్లతో పోలిస్తే, నాటు గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం. వీటిలో ఏది మేలు? తెలుసుకుందాం!
ఫారం కోళ్ల గుడ్ల కంటే నాటు కోడి గుడ్లు ఆరోగ్యకరం అన్నది అపోహ మాత్రమే! గుడ్లకు గోధుమ రంగు కోళ్ల బ్రీడ్ నుంచి సమకూరుతుంది. అది జన్యుపరమైన లక్షణం. పోషక లక్షణం కానే కాదు. పైగా నాటు గుడ్ల ధర కూడా ఎక్కువ. నాటు కోళ్లు తక్కువ గుడ్లు పెడతాయి కాబట్టి వీటి గుడ్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప వాటిలో ఎక్కువ పోషకాలుంటాయి కాబట్టే ధర ఎక్కువ అని అనుకోకూడదు. పోషకవిలువల పరంగా రెండు రకాల గుడ్లు సమానమైనవే! రెండింట్లోనూ సమాన క్యాలరీలుంటాయి. అయితే కోళ్లను పెంచిన విధానం, కోళ్లు తినే ఆహారం గుడ్ల పోషకాల మీద ప్రభావాన్ని కనబరుస్తాయి. కాబట్టి ఈ అంశాల మీద దృష్టి పెడుతూ, స్వేచ్ఛగా తిరిగే కోళ్లు పెట్టే తాజా గుడ్లకు ప్రాధాన్యమివ్వాలి.
ఇవి కూడా చదవండి..
'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం