Share News

వేసవిలో అక్వేరియం చల్లగా ఇలా...

ABN , Publish Date - May 06 , 2026 | 04:59 AM

ఇంటి అలంకరణకోసం ఏర్పాటు చేసుకున్న అక్వేరియాన్ని వేసవిలో ప్రత్యేకంగా సంరక్షించాలి. లేదంటే అందులోని చేపలకు...

వేసవిలో అక్వేరియం చల్లగా ఇలా...

ఇంటి అలంకరణకోసం ఏర్పాటు చేసుకున్న అక్వేరియాన్ని వేసవిలో ప్రత్యేకంగా సంరక్షించాలి. లేదంటే అందులోని చేపలకు నష్టం వాటిల్లుతుంది. వాతావరణం వేడెక్కుతున్నప్పుడు అక్వేరియాన్ని చల్లగా ఎలా ఉంచాలో తెలుసుకుందాం...

  • అక్వేరియాన్ని గాజుతో రూపొందిస్తారు. కాబట్టి ఎండ పెరిగే కొద్దీ దానిలోని నీరు త్వరగా వేడెక్కుతుంటుంది. తరచూ ఈ నీటిని మారుస్తూ ఉండాలి. అక్వేరియంలో మరీ చల్లటి నీటిని పోయకూడదు. నేరుగా ఐస్‌ ముక్కలు వేయకూడదు. అలా చేస్తే చేపల్లో జీవక్రియల పనితీరు మందగిస్తుంది. అక్వేరియంలో ఉండే రాళ్లు, గడ్డి లాంటివాటిని కూడా తరచూ మారుస్తూ ఉండాలి.

  • చేపలు ఆకర్షణీయంగా కనిపించాలని అక్వేరియంలో ఎప్పుడూ లైట్లు వేసి ఉంచడం వల్ల దానిలోని నీరు వేడెక్కుతుంది. అలాకాకుండా పగటిపూట లైట్లు ఆర్పేయడం మంచిది. అక్వేరియం ఉంచిన గదిలో కూడా ఎక్కువసేపు లైట్లు వేసి ఉంచకూడదు. ప్రస్తుతం మార్కెట్లో ఫిష్‌ ఫ్రెండ్లీ లైట్లు లభ్యమవుతున్నాయి. వాటిని తెచ్చి ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

  • అక్వేరియాన్ని రోజంతా చల్లగా ఉండే గది మూలలో ఏర్పాటు చేసుకోవాలి. దాని లోపల క్లిప్‌ ఫ్యాన్‌ లేదా అక్వేరియం ఫ్యాన్‌ను ఏర్పాటు చేస్తే నీళ్లు త్వరగా వేడెక్కవు.

  • అక్వేరియంలో నీరు వేడెక్కే కొద్దీ దానిలోని ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతుంటాయి. దీంతో చేపలు చనిపోవచ్చు. అలాకాకుండా అక్వేరియానికి ఉన్న వెంటిలేషన్‌ మూతను తీసి ఉంచాలి. నీటిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ డ్రాప్స్‌ వేయాలి.

  • ఇరువైపులా ఇండోర్‌ ప్లాంట్స్‌ కుండీలను ఉంచితే అక్వేరియం వేడెక్కకుండా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు తెరచి ఉంచడం వల్ల తాజాగాలి ప్రసరించి ఇల్లంతా చల్లగా మారుతుంది. దీంతో అక్వేరియం కూడా సాధారణ ఉష్ణోగ్రతలోనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 04:59 AM