Share News

చీమలతో సమస్యా..?

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:51 AM

వర్షాల వల్ల ఇంట్లోకి వచ్చే చీమలను నిలువరించే చిట్కాలివే...

చీమలతో సమస్యా..?

వర్షాల వల్ల ఇంట్లోకి వచ్చే చీమలను నిలువరించే చిట్కాలివే...

  • చీమలు ఇంట్లోకి వచ్చే దారిలో కొద్దిగా నిమ్మరసం చల్లితే ప్రయోజనం ఉంటుంది. నిమ్మరసం కలిపిన నీటితో ఇల్లు తుడిచినా మంచిదే.

  • బాటిల్‌లో సగానికి పైగా నీటిని తీసుకుని రెండు చెంచాల వైట్‌ వెనిగర్‌ వేసి బాగా కలిపి ఇంట్లో అక్కడక్కడా స్ర్పే చేస్తే చీమలు లోనికి రావు.

  • దాల్చిన చెక్క పొడి లేదా మిరియాల పొడిని వంటగది మూలల్లో చల్లితే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • చీమలు చేరే ప్రదేశాల్లో కొన్ని పుదీనా ఆకులు ఉంచితే సమస్య తీరుతుంది. ఇంట్లో మింట్‌ ఆయిల్‌ లేదా టీ ట్రీ ఆయిల్‌ను స్ర్పే చేసినా ఫలితం ఉంటుంది.

  • ఇంట్లో ప్రతి గది మూలల్లో కొన్ని కర్పూరం బిళ్లలు ఉంచితే వాటి ఘాటుకి చీమలు లోపలికి రావు.

  • ఇంట్లో ఉండే ఇండోర్‌ ప్లాంట్స్‌ కుండీల దగ్గర చీమలు ఎక్కువగా చేరుతుంటాయి. ఈ కుండీల్లో వాడేసిన నిమ్మ తొక్కలు లేదా కొద్దిగా కాఫీ పొడి ఉంచితే ప్రయోజనకరంగా ఉంటుంది.

  • చీమలు ఇంట్లోకి బారులు కట్టినప్పుడు వాటిపై కొద్దిగా పసుపు చల్లితే వెంటనే అవి బయటికి వెళ్లిపోతాయి.

ఇవీ చదవండి:

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

భారత్ - ఈయూ ఫ్రీ ట్రేడ్ డీల్.. డిసెంబర్‌లో సంతకాలు!

Updated Date - Jun 22 , 2026 | 01:51 AM