మద్యంతో ముప్పుతిప్పలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:44 AM
మద్యం మన శరీరంలో నిల్వ ఉండలేదు. కాబట్టి మన కాలేయం దాన్ని విరిచే పని మొదలుపెడుతుంది.
మీకు తెలుసా?
మద్యం మన శరీరంలో నిల్వ ఉండలేదు. కాబట్టి మన కాలేయం దాన్ని విరిచే పని మొదలుపెడుతుంది.
ఫలితంగా 12 నుంచి 24 గంటల పాటు కొవ్వు కరిగే ప్రక్రియ ఆగిపోతుంది. ఆ సమయ పరిధిలో తిన్నదంతా కొవ్వుగా నిల్వ ఉండిపోతుంది. మద్యంతో ముప్పులు ఇవి మాత్రమే కావు..
తీసుకునే ప్రతి ఆహారాన్నీ నిల్వ చేసుకునే వ్యవస్థలు మన శరీరంలో ఉన్నాయి. పిండిపదార్థాలు గ్లైకోజన్‌గా నిల్వ అవుతాయి. కొవ్వు, అడిపోజ్ కణజాలంలో నిల్వ అవుతుంది. ప్రొటీన్ అమీనో యాసిడ్స్‌గా నిల్వ అవుతుంది. మన శరీరం వీటన్నిటినీ పక్కన పెట్టుకుని, అవసరమైనప్పుడు ఉపయోగించుకోగలుగుతుంది. కానీ ఆల్కహాల్ మన శరీరంలో నిల్వ ఉండలేదు. దాన్ని నిల్వ చేసుకుని ఉపయోగించుకునే వెసులుబాటు మన శరీరానికి లేదు. కాబట్టి మన శరీరం దాన్ని తొలగించాల్సిన పదార్థంగా పరిగణిస్తుంది. కాబట్టే దాన్ని తొలగించేవరకూ మన కాలేయం ఇతరత్రా పనులన్నిటినీ పక్కన పెట్టేస్తుంది. ఈ ప్రకియ్రలో కొవ్వు ఆక్సీకరణ ఆగిపోతుంది. ఈ స్థితి 12 నుంచి 24 గంటల వరకూ కొనసాగుతుంది. మద్యంతో పాటు ఆహారం తిన్నప్పుడు, కాలేయం మద్యాన్ని ప్రాసెస్ చేసే పనిలో బిజీగా ఉండడం వల్ల, శరీరం ఇంధనం కోసం ఆహారం నుంచి శక్తిని సంగ్రహించడం తగ్గిస్తుంది. దాంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ప్రతి రోజూ మద్యం తీసుకునే వారిలో ఈ ప్రక్రియ మరింత క్షీణించి, ఊబకాయం వేధిస్తుంది. అంతర్గత అవయవాల చుట్టూరా కొవ్వు పేరుకుపోతుంది. ఈ పరిస్థితి గుండెకూ, కాలేయానికీ చేటు చేస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..