మొటిమలు మాయం ఇలా...
ABN , Publish Date - Aug 23 , 2026 | 02:28 AM
ముఖంపై తరచూ మొటిమలు వస్తుంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి...
ముఖంపై తరచూ మొటిమలు వస్తుంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి...
బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి తప్పనిసరిగా సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి. దీనివల్ల సూర్యరశ్మిలోని హానికారక కిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
ముఖానికి రాసుకునే క్రీమ్‌లు, మాయిశ్చరైజర్లు, హైలైటర్లు, లిక్విడ్ ఫౌండేషన్లు తదితరాల్లో అంతగా ఆయిల్ లేని ఉత్పత్తులను ఉపయోగించాలి. దీనివల్ల ముఖంపై జిడ్డు తగ్గుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవు. ఫలితంగా మొటిమల సమస్య తీరుతుంది.
మొటిమలు ఉంటే రోజుకు రెండుసార్లు ముఖాన్ని మైల్డ్ క్లెన్సర్‌తో కడగాలి. దీంతో జిడ్డు, మురికి తొలగి క్రమంగా మొటిమలు మాయమవుతాయి.
మొటిమలను చేత్తో తాకకూడదు. వాటిని గిల్లడం, ఒత్తడం చేయకూడదు. అలా చేస్తే సమస్య తీవ్రమవుతుంది.
తరచూ మంచినీటిని తాగుతుండాలి. అప్పుడే చర్మం తేమతో నిండుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటికి విసర్జితమవుతాయి. జీవక్రియలు సజావుగా జరుగుతుంటే మొటిమలు అంతగా రావు.
స్వీట్లు, నూనె పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌ను తీసుకోకూడదు. తాజా పండ్లు, కూరగాయలను తింటుంటే ఫలితం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్